Bhatti Vikramarka : పారిశ్రామికవేత్తలు సంపద సృష్టికర్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిశ్రామికవేత్తలు సంపద సృష్టికర్తలు రాష్ట్రంలో సింగపూర్ నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఆయన కౌన్సిల్ జనరల్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ఎడ్గర్ పాంగ్ బృందంతో సచివాలయంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్నదని స్పష్టం చేశారు. ఇక్కడ అన్ని వర్గాల వారు ఆస్వాదించే భౌగోళిక వాతావరణం ఉంటుందని, సర్వత్ర స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని.. మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని సింగపూర్ బృందానికి వివరించారు. ఇక్కడ పెట్టుబడులకు సలహాలు సూచనలు ఇవ్వండి… ఆహ్వానించే విషయం లో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన విధానాలు ఉన్నాయన్నారు. ఔటర్ రింగ్ రోడ్ (ORR) నిర్మాణంతో హైదరాబాద్ లో పెట్టుబడుల భూమ్ ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలని కలిపేలా తాజాగా రీజినల్ రింగ్ రోడ్ (RRR) నిర్మాణం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి క్లస్టర్ జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫార్మా, TEXTILE, ఐటీ క్లస్టర్లు ఏర్పాటు చేసి అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నామన్నారు. హైదరాబాద్ పట్టణంలోని పురాతన మూసీ నదిని పునర్-జీవింప చేసే చర్యలు ప్రారంభించామన్నారు. మూసి రివర్ ఫ్రెంట్ బోర్డు ద్వారా మంచినీటితో మూసిని నింపి.. థేమ్స్ నదిలా మారుస్తామన్నారు.
Matrimonial fraud: మ్యాట్రిమోని ద్వారా 250 మంది మహిళలను మోసం చేసిన 45 ఏళ్ల వ్యక్తి..
Also Read
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Veg Keema: నాన్వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
మూసీ నది పరివాహక ప్రాంతం అంతటిని కమర్షియల్, చిల్డ్రన్ పార్క్, మాల్స్ నిర్మాణం చేసి ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. ఇటీవల జపాన్ కు చెందిన జై కా వారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు చర్చించిన విషయాన్ని సింగపూర్ బృందంతో డిప్యూటీ సీఎం పంచుకున్నారు. వ్యవసాయ ఆధారిత రంగంలో తెలంగాణ బలోపేతంగా ఉందన్న విషయాన్ని వారికి వివరించారు. మీరు పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన భూమి, తెర వనరులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. తెలంగాణ GSDP బాగా పెరిగింది అన్న విషయాన్ని వివరించారు. ఐటి, ఫార్మా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో ఉంది. సింగపూర్ కు చెందిన కొన్ని కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని ఎడ్గర్ పాంగ్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు వివరించారు. అర్బన్ ప్లానింగ్ విషయంలో తమకు మంచి పట్టు ఉందని వివరించారు. సింగపూర్ కు చెందిన అతిపెద్ద డీబీఎస్ బ్యాంక్ హైదరాబాదులో ఉన్నట్టు తెలిపారు. ఐటీ పార్కులో సింగపూర్ ఆఫీసులు ఉన్న విషయాన్ని వివరించారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది, రెండు రోజులకు ఒకసారి సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రయాణికులతో హైదరాబాద్ రాకపోకలు సాగిస్తోంది, ఎయిర్ ఇండియా సైతం పెద్ద సంఖ్యలో సింగపూర్ కు ఎయిర్ లైన్ సేవలు అందిస్తున్న వివరాన్ని వివరించారు. హైదరాబాద్ బయోటెక్ హబ్ గా స్థిరపడుతుందని పాంగ్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రత్యేకంగా సహకారం తీసుకుంటామని పాంగ్ తెలిపారు.
తాజావార్తలు
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
ట్రెండింగ్
-
Veg Keema: నాన్వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!