జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై ఇద్దరి నేతల మధ్య కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.
దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్వేషాలు పెరిగిపోతున్నాయని, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మెగా ర్యాలీ వేదికపై నుంచి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.
Congress Working Committee To Meet On Sunday: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసేందుకు ఈ నెల 28న కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాధికార కమిటీ అయిన కాంగ్రెస్ వర్కంగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ) సమావేశం అవుతోంది. ఆగస్టు 28, మధ్యాహ్నం 3.30 గంటలకు సోనియా అధ్యక్షతన వర్చువల్ గా సమావేశాన్ని నిర్వహించనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం సోనియా గాంధీ…
Sonia Gandhi to travel abroad for medical check-ups: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లనున్నారు. సోనియా వెంట రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీ కూడా వెళ్లనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మంగళవారం తెలిపింది. అయితే వారి పర్యటకు సంబంధించిన తేదీలను వెల్లడించలేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలు వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లనున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
''భారత్ జోడో'' పాదయాత్రపై నిర్వహించిన సమావేశంలో దేశం నలుమూలలు నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి వచ్చిన ప్రతినిధులనుద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు.
Congress Bharat Jodo Yatra: 2024 సార్వత్రిక ఎన్నికల్లో పుంజుకుని దేశంలో మళ్లీ పూర్వ వైభవం సాధించాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో దేశమంతా చుట్టాలని ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు గురువారం జరగనున్న సీడబ్ల్యూసీ మీటింగ్‌లో రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారు కానుంది. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అందులో సగం…
CWC Meeting: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాధికార కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ) గురువారం భేటీ కాబోతోంది. రేపు సాయంత్రం 5.30 నిమిషాలకు సోనియా అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు రేపు జరగబోయే సీడబ్ల్యూసీ మీటింగ్ లో అధిక ధరలకు వ్యతిరేకంగా ఆగస్టు 28న ఢిల్లీలో రాంలీలా మైదానంలో నిర్వహించబోతోన్న ర్యాలీ గురించి కూడా చర్చించనున్నారు.
రాహుల్‌గాంధీ.. కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరు. అధ్యక్షుడు సహా వివిధ పదవులు చేపట్టినా పార్టీపై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. హస్తం పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయన పాత్ర నామమాత్రంగా మారింది. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్నా కీలకమైన కేంద్ర మంత్రి పదవులు చేపట్టలేదు. ప్రభుత్వంలో భాగస్వామి కాలేదు. జాతీయ స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలోనూ ఆయన చెప్పుకోదగ్గ ఫలితాలు రాబట్టలేకపోయారు. దీంతో హస్తం పార్టీ ఒక్కో రాష్ట్రాన్నీ…