Rahul Gandhi: దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్వేషాలు పెరిగిపోతున్నాయని, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మెగా ర్యాలీ వేదికపై నుంచి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రజలు తమ భవిష్యత్తు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి భయపడుతున్నారని, అది వారిని ద్వేషం వైపు మళ్లిస్తోందని ఆయన అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దేశాన్ని విభజిస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ చెపట్టిన ‘మెహంగై పర్ హల్లా బోల్ ర్యాలీ’కి భారీగా జనం తరలివచ్చారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నేతలు హాజరై మాట్లాడారు. ‘ ప్రభుత్వం నుంచి ఇద్దరే వ్యాపారవేత్తలు లబ్ధిపొందుతున్నారు. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రోడ్లు.. ప్రతిఒక్కటి ఆ ఇద్దరే చేజిక్కించుకుంటున్నారు. నరేంద్ర మోడీ దేశాన్ని వెనకబడేలా చేస్తున్నారు. విద్వేషాలు వ్యాప్తి చేస్తున్నారు. దాని ద్వారా పాకిస్థాన్, చైనాలు లబ్ధి పొందుతున్నాయి. పీఎం మోదీ గత 8 ఏళ్లుగా దేశాన్ని బలహీనపరిచారు.’ అని బీజేపీ, ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు .
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ద్వేషం, కోపం పెరుగుతోందని.. మీడియా, న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం వంటి సంస్థలపై ఒత్తిడి ఉందని, ప్రభుత్వం వాటన్నింటిపై దాడులు చేస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో ఇలాంటి ధరల పెరుగుదల ఎన్నడూ చూడలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చైనాతో ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం లేదా నిరుద్యోగం కావచ్చు, ఈ సమస్యలను పార్లమెంటులో లేవనెత్తడానికి ప్రతిపక్షాలను అనుమతించరు” అని ఆయన అన్నారు. నరేంద్ర మోదీ దేశాన్ని వెనక్కు తీసుకెళ్తున్నారని, విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, దీని వల్ల పాకిస్థాన్, చైనాలు లబ్ది పొందుతున్నాయని, గత ఎనిమిదేళ్లలో ప్రధాని మోడీ భారత్‌ను బలహీనపరిచారన్నారు.
Arvind kejriwal: భగవద్గీత శ్లోకాన్ని తప్పుగా చదివిన కేజ్రీవాల్.. వీడియో వైరల్
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆపార్టీ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాకపోతుండటంతో.. ఈసారి ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు సెప్టెంబర్7వ తేదీ నుంచి భారత్ జోడో యాత్రకు యువనేత రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టనున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజుల పాటు 3,570 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఈ మెగా ర్యాలీ వేదికను ఏర్పాటు చేసింది. ‘భారత్ జోడో యాత్ర’ అనేది కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద మాస్ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌గా ప్రచారం చేయబడుతోంది, ఇక్కడ పార్టీ నాయకులు అట్టడుగు స్థాయిలో సామాన్య ప్రజలకు చేరువ అవుతారు.”ఈ యాత్రతో సామాన్య ప్రజలను కలుసుకుని, ప్రభుత్వం చేస్తున్న అబద్ధాల గురించి…కేంద్ర సంస్థల దుర్వినియోగం గురించి చెప్పాలనుకుంటున్నాం. నన్ను ఈడీ 55 గంటలు విచారించింది. ప్రశ్నించినా పట్టించుకోవడం లేదు. 100 ఏళ్ల పాటు.. వీటన్నింటికీ వ్యతిరేకంగా మనం నిలబడాలి. ఈ దేశం ఇద్దరు వ్యక్తులకు చెందినది కాదు, రైతులు, కార్మికులు మరియు నిరుద్యోగ యువతకు కూడా చెందినది” అని రాహుల్ గాంధీ అన్నారు.
ఈ మెగా ర్యాలీకి కార్యకర్తలను సిద్ధం చేసేందుకు వారం రోజులుగా తీవ్రంగా శ్రమించారు కాంగ్రెస్ నేతలు. 22 నగరాల్లో ప్రత్యేక సమావేశాలను నిర‍్వహించి ఢిల్లీ చలో నినాదంతో పిలుపునిచ్చారు. రామ్‌లీలా మైదానంలో ర్యాలీకి ముందు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న విద్వేషాలు ప్రధాన సమస్యలుగా మారాయన్నారు. పెరుగుతున్న ధరల కారణంగా సామాన్య ప్రజల బాధలను కేంద్రం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాన ప్రతిపక్షంగా తమ సమస్యల కోసం వీధుల్లో పోరాడుతూనే ఉంటుందని పేర్కొంది.