Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’ తమిళనాడు కన్యాకుమారి నుంచి బుధవారం ప్రారంభం అయింది. రాహుల్ పాదయాత్ర రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు కన్యాకుమారి అగస్తీశ్వరం నుంచి పాదయాత్ర ప్రారంభం అవ్వనుంది. వివేకానంద పాలిటెక్నిక్ కాలేజీ నుంచి పాదయాత్ర ప్రారంభం అయింది. రాహుల్ గాంధీతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో పాటు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ వెంట నడవనున్నారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో పర్యటిస్తోన్న వేళ కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను విమర్శించే క్రమంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ను విమర్శించే క్రమంలో బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లను తిరిగి మన దేశంలో కలపాలంటూ ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది.
024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ బుధవారం తన మెగా భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. ఈ యాత్ర పార్టీ పునరుజ్జీవనానికి దోహదపడుతుందని జి-23 నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమిళనాడులోని కన్యాకుమారి నుంచి పార్టీ భారత్ జోడో యాత్రను ప్రారంభించారు.
తమిళనాడుకు తనకు ఎంతో అనుబంధం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. తమిళనాడులో కన్యాకుమారి వద్ద 'భారత్ జోడో యాత్ర'ను ప్రారంభించిన అనంతరం గాంధీ మండపం వద్ద బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో రాహుల్ ప్రసంగించారు. భారత్ జోడో యాత్రకు ఇక్కడి సముద్రం, ఆహ్లాదకర వాతావరణం జోష్ నింపుతోందన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం సాయంత్రం 5గంటలకు కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. తన ముందు పార్టీ సేవా దళ్ శ్రేణులు కదం తొక్కుతూ సాగగా… రాహుల్ గాంధీ తన సుదీర్ఘ యాత్రను ప్రారంభించారు.
Rahul Gandhi's Bharat Jodo Yatra launch today: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ నేడు ప్రారంభం కాబోతోంది. కన్యాకుమారిలో బుధవారం యాత్ర ప్రారంభం కాబోతోంది. అంతకుముందు రాహుల్ గాంధీ శ్రీపెరంబుదూర్ లోని రాజీవ్ గాంధీ స్మారక చిహ్నం వద్ద నివాళి అర్పించనున్నారు. మొత్తం 3,570 కిలోమీటర్లు, 150 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఐదు నెలల్లో 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల గుండా పాదయాత్ర…