బెంగళూరులో వైమానిక దళ అధికారి బోస్, ఆయన భార్య మధుమితతో కలిసి కారులో వెళ్తుండగా కొందరు వ్యక్తులు దాడి చేశారంటూ పోలీసులకు తెలియజేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు దిమ్మతిరిగే దృశ్యాలు కనిపించాయి. బోసే.. దాడి చేసినట్లుగా దృశ్యాలు కనిపించడంతో పోలీసులు ఖంగుతిన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Vijayasai Reddy: లిక్కర్ స్కామ్‌లో సాయిరెడ్డి సంచలన ట్వీట్.. వారి పని పట్టండి.. నేను పూర్తిగా సహకరిస్తా..
ఫుట్‌పాత్‌పై నిల్చొన్న వికాస్ కుమార్ అనే వ్యక్తిపై బోస్ విచక్షణా రహితంగా దాడి చేశాడు. పిడిగుద్దుల వర్షం కురిపించాడు. అక్కడే ఉన్న కొందరు విడిపించే ప్రయత్నం చేసినా.. వారిపై కూడా దూకుడు ప్రదర్శించాడు. దాడికి పాల్పడ్డాడు. గొడవకు కారణమేంటో తెలియదు గానీ ఇరువర్గాలు పరస్పర దాడిగా పోలీసులు గుర్తించారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవరాజ్ పేర్కొన్నారు. బోస్ ముఖం నుంచి రక్తస్రావం కావడంతో పోలీస్ స్టేషన్‌కు వచ్చారని.. అనంతరం ప్రాథమిక చికిత్స అందించామన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయమంటే ఫ్లైట్‌కి టైమ్ అవుతుందని వెళ్లిపోయారన్నారు.
ఇది కూడా చదవండి: Dil Raju: జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానం
అయితే బోస్ ఒక వీడియో విడుదల చేశారు. కారు వెనుక నుంచి వచ్చిన ఒక వ్యక్తి కన్నడలో దుర్భాషలాడాడని.. కారుపై డీఆర్‌డీవో అని రాసి ఉన్న కూడా నా భార్యను దుర్భాషలాడడని వాపోయాడు. కారులోంచి కిందకు దిగగానే నుదిటపై బైక్ కీతో కొట్టాడని.. దీంతో రక్తస్రావం అయిందని తెలిపాడు. కర్ణాటకలో పరిస్థితులు ఆశ్చర్యంగా ఉన్నాయని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇది కాస్త వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ఇది కన్నడిగులు వర్సెస్ కన్నడిగులు కానివారి కేసు కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: US: విమానంలో మంటలు.. తప్పిన భారీ ముప్పు
Wing commander assault case in #Bengaluru
CCTV tells a different story.. Wing Commander Shiladitya Bose seen brutally assaulting the biker at Tin Factory Junction
Despite locals stepping in to stop the violence, the officer can be seen continuing the attack…blowing… pic.twitter.com/ovMg9g4xcS
— Nabila Jamal (@nabilajamal_) April 21, 2025