కన్నడ నటి, బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన రన్యా రావు మరింత చిక్కుల్లో పడ్డారు. ఆమెపై నమోదైన కేసుల నేపథ్యంలో ఏడాది పాటు ఆమెకు బెయిల్ లభించే పరిస్థితులు లేవు. దీంతో సంవత్సరం పాటు కారాగారంలోనే బందీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రన్యా రావుపై అక్రమ రవాణా నిరోధక చట్టం కింద అభియోగాలు మోపబడ్డాయి. దీంతో ఒక సంవత్సరం పాటు నిర్బంధంలో ఉండొచ్చని వర్గాలు పేర్కొన్నాయి. కోఫెపోసా చట్టం కారణంగా ఒక సంవత్సరం పాటు బెయిల్ లభించే అవకాశం ఉండదని తెలుస్తోంది. ప్రస్తుతం రన్యారావు బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉంది. రన్యారావుపై విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ మరియు స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం, 1947 (COFEPOSA) కింద కేసు నమోదు చేసినట్లు శుక్రవారం వర్గాలు ధృవీకరించాయి.
రన్యరావుతో పాటు ఇతర నిందితులైన తరుణ్ రాజు, సాహిల్ సకారియా జైన్‌లపై కోఫెపోసా చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి. నిందితులెవరికీ ఏడాది పాటు బెయిల్ లభించదు. ముగ్గురు నిందితులు కూడా ప్రస్తుం బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ కేసును డీఆర్‌ఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Bandi Sanjay : పాక్ వెన్నులో వణుకుపుట్టేలా చర్యలుంటాయ్
మార్చి 3న బంగారం స్మగ్లింగ్ చేస్తూ రన్యారావు బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో పట్టుబడింది. ఆమె దగ్గర నుంచి 14.2 కిలోల గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 12.56 కోట్లకు పైగా ఉంటుంది. అనంతరం ఆమె ఇంట్లో తనిఖీ చేయగా.. రూ.3 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె స్నేహితుడు తరుణ్ రాజును అరెస్ట్ చేశారు. వీళ్లిద్దరూ కలిసి స్మగ్లింగ్‌కు పాల్పడినట్లు పేర్కొ్న్నారు. నాలుగు నెలల క్రితమే ఆమెకు వివాహం అయింది. కానీ భర్తతో కాపురం చేయలేదు. మాటిమాటికీ దుబాయ్ వెళ్తూ వస్తుండేది. దీంతో ఆమెకు భర్త దూరంగా ఉన్నాడు.
ఇది కూడా చదవండి: India-Pak: ఈనెల 29తో అన్ని రకాల వీసాలు రద్దు.. పాకిస్థానీయులు వెళ్లిపోవాలని ఆదేశాలు