Karnataka: నేను ఎప్పటికీ కన్నడ మాట్లాడన్న బ్యాంకు ఉద్యోగి.. ఎస్బీఐ ఏం చేసిందంటే..?
- భాష విషయంలో కస్టమర్‌తో గొడవకు దిగిన ఎస్బీఐ బ్యాంక్ ఉద్యోగి..
- నేను ఎప్పటికీ కన్నడ మాట్లాడు అని తేల్చి చెప్పిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి..
- కన్నడ మాట్లాడటం తప్పనిసరని ఏమైనా రూల్ ఉందా అని కస్టమర్ ని ప్రశ్నించిన ఉద్యోగి..
- బ్యాంకు ఉద్యోగి ప్రవర్తనకు క్షమాపణలు చెప్పిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి ఒకరు కస్టమర్‌తో సంభాషిస్తున్న సమయంలో కన్నడ మాట్లాడటానికి నిరాకరించడంతో కర్ణాటకలో వివాదానికి దారి తీసింది. ప్రజల నుండి తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ఘటన అనేకల్ తాలూకాలోని సూర్య నగర్ బ్యాంక్ బ్రాంచ్‌లో జరిగింది. అయితే, బ్యాంకుకు వెళ్లిన ఓ కస్టమర్ స్థానిక భాష మాట్లాడటంతో బ్యాంకు సిబ్బంది గొడవకు దిగింది.
Read Also: Rains: బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
Also Read
అయితే, ఆ వీడియోలో కన్నడ మాట్లాడున్న కస్టమర్ ఎవరు అని ఆ బ్యాంకు ఉద్యోగి అడుగుతున్నట్లు మనం చూడొచ్చు. దీంతో స్థానిక భాషలో మాట్లాడాలని బ్యాంకు ఎంప్లాయీని అతడు కోరాడు. ఇక, కన్నడ మాట్లాడటం తప్పనిసరి చేసే ఏదైనా నియమం ఉందా అని కస్టమర్ ను ప్రశ్నించింది. పదే పదే ఆ అధికారిని కన్నడ మాట్లాడమని చెప్పడంతో విసుగు చెందిన ఆ ఉద్యోగి నేను ఎప్పటికీ కన్నడ మాట్లాడను అని ప్రకటిస్తూ వెళ్ళిపోయింది. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అలాగే, ఈ వీడియోను SBI, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను ట్యాగ్ చేస్తూ, తమ సిబ్బందితో కస్టమర్లపై బలవంతంగా హిందీని రుద్దుతున్నారని రాసుకొచ్చాడు.
Read Also: US: అత్యంత శక్తివంతమైన గోల్డెన్ డోమ్ వ్యవస్థను పరిచయం చేసిన ట్రంప్
ఇక, ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బహిరంగ ప్రకటన విడుదల చేసింది. బెంగళూరులోని AO సౌత్‌లోని మా సూర్య నగర్ బ్రాంచ్‌లో ఇటీవల జరిగిన సంఘటనపై మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాం.. ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని బ్యాంక్ తెలిపింది. కస్టమర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసేలా ప్రవర్తించిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటుందని పేర్కొనింది. కస్టమర్లను గౌరవించడం తమ మొదటి ప్రయార్టీ అని ఎస్బీఐ చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?