Rapido: బెంగళూర్‌లో ఒక మహిళపై ర్యాపిడో డ్రైవర్ వేధింపులకు పాల్పడ్డాడు. రాపిడో ఆటో రిక్షా డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన సెప్టెంబర్ 8న నగరంలోని దయానంద సాగర్ కాలేజ్ సమీపంలోని కుమారస్వామి లే అవుట్ నుంచి రాపిడో యాప్ ద్వారా ఆటో బుక్ చేసుకున్న తర్వాత జరిగినట్లు తెలుస్తోంది. హనుమంతప్ప హెచ్ తలావర్ అనే డ్రైవర్ సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో మహిళను పికప్ చేసుకుని సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో ఆమె అపార్ట్మెంట్ దగ్గర దింపాడు.
ప్రయాణంలో ఆమెను అసభ్యంగా తాకుతూ, మాటలతో వేధించాడు. ఆమెను సినిమా హీరోయిన్‌లా ఉన్నావని చెబుతూ, ఆమె బ్యాగుల్ని జాగ్రత్తగా చూసుకునే నెపంతో ఆమెను అసభ్యంగా తాకాడు. డ్రైవర్ జ్వరం వచ్చిందని చెబుతూ, తన నుదురును, ఛాతిని అనుచితంగా తాకుతూ వేధించాడని మహిళ ఆరోపించింది. ఆమె వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో ఆటోలో ఉండేలా పట్టుబట్టాడని, చివరకు బాధితురాలు అతడిని తోసేసి, ఇంట్లోకి పరిగెత్తింది. ఈ సంఘటపై మహిళ, తన తల్లిదండ్రులకు చెప్పి, పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Pakistan: వచ్చే వారం ట్రంప్‌తో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భేటీ..
ఈ సంఘటనపై ర్యాపిడో సంస్థ స్పందించింది. ‘‘బెంగళూరులో జరిగిన సంఘటన మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. మా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు ఎవరూ అసురక్షితంగా లేదా వేధింపులకు గురికాకూడదు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే, మేము ప్రయాణీకురాలిని సంప్రదించి, ఆమెకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించాము మరియు కఠినమైన చర్య తీసుకుంటామని హామీ ఇచ్చాము. కెప్టెన్‌ను శాశ్వతంగా సస్పెండ్ చేసి, భవిష్యత్తులో అతను రైడ్‌లు తీసుకోకుండా చూసుకోవడానికి బ్లాక్‌లిస్ట్‌లో ఉంచాము.’’ అని చెప్పింది.
వృత్తిపరమైన ప్రవర్తనను నిర్వహించడానికి డ్రైవర్లకు శిక్షణను బలోపేతం చేస్తున్నట్లు ర్యాపిడో చెప్పింది. మహిళల భద్రత కోసం రాత్రి 10 గంటల తర్వాత భద్రతా కాల్స్, 247 యాప్‌లో SOS సపోర్ట్ ఇస్తున్నట్లు, వాహనం, డ్రైవర్ వివరాలను ధ్రువీకరించాలని ప్రయాణికుల్ని కోరుతూ నిరంతరం రిమైండర్‌లతో సహా రాపిడో తన భద్రతా చర్యల్ని హైలెట్ చేసింది.