Virosh : విజయ్ ‘ఐస్‌క్రీమ్స్’ వెనుక రష్మిక.. ప్రేమకు బీజం ఇలా పడిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి, అభిమానులకు స్వీట్లు పంచుతూ తమ సంతోషాన్ని చాటుకుంటున్న ఈ జంట వెనుక ఒక అందమైన ఫ్లాష్‌బ్యాక్ ఉంది. ఒకప్పుడు కేవలం సహనటులుగా ఉన్న వీరిద్దరి మధ్య స్నేహం ఎలా మొదలైంది? అసలు విజయ్ ప్రతి ఏడాది తన పుట్టినరోజున ఐస్‌క్రీం ట్రక్కులు తిప్పే సంప్రదాయానికి ప్రేరణ ఎవరు? అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సుమారు ఏడేళ్ల క్రితం ‘గీత గోవిందం’ సినిమా చిత్రీకరణ సమయంలో ఈ కథకు పునాది పడింది, మే నెల ఎండల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్లో పనిచేసే వారందరూ తీవ్రమైన ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు, ఆ సమయంలో రష్మిక మందన్న తన సొంత ఖర్చుతో సెట్లోని సిబ్బంది అందరికీ ఐస్‌క్రీంలు తెప్పించారు. చమటలు కక్కుతూ పనిచేస్తున్న కార్మికుల ముఖాల్లో ఆ ఐస్‌క్రీం తింటున్నప్పుడు కనిపించిన తృప్తి, చిరునవ్వు విజయ్ దేవరకొండ మనసును గట్టిగా తాకాయి.
Also Read :ViRosh : విరోష్.. రిసెప్షన్ కు వారికి నో ఎంట్రీ..
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
అప్పట్లో ‘నోటా’ సినిమా ప్రమోషన్ల కోసం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విజయ్ తన లైఫ్ ఫిలాసఫీ గురించి మాట్లాడుతూ ఈ విషయాన్ని గుర్తుచేసుకున్నారు. “సెట్లో అందరూ ఐస్‌క్రీంలు తింటూ నవ్వుతూ కనిపిస్తే ఏంటని అడిగా, రష్మిక మేడమ్ ఇప్పించారని చెప్పారు. ఆ చిన్న పనిలో ఎంత సంతోషం ఉందో అప్పుడు అర్థమైంది, నా పుట్టినరోజు కూడా ఎండాకాలమే వస్తుంది కదా.. నేను కూడా ఎందుకు ఇలా చేయకూడదు?” అని ఆయన అలా ట్రక్స్ తిప్పడం మొదలు పెట్టానని చెప్పుకొచ్చారు. రష్మిక ఇచ్చిన ఆ చిన్న ప్రేరణను విజయ్ ఒక గొప్ప సంప్రదాయంగా మార్చుకున్న విజయ్ అప్పటి నుంచి ప్రతి ఏటా తన పుట్టినరోజున హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఐస్‌క్రీం ట్రక్కులను తిప్పుతూ వేలాది మందికి చల్లని తీపిని పంచుతున్నారు. కేవలం ఒక నటిగా కాకుండా, తోటి మనుషుల పట్ల రష్మికకు ఉన్న ఆదరణే విజయ్‌ను ఆమె వైపు ఆకర్షించేలా చేసిందని చెప్పవచ్చు.
Also Read :Mana Shankar Varaprasad Garu: 109 సెంటర్లలో 50 రోజులు.. సరికొత్త రికార్డు
అలా ఐస్‌క్రీం ముచ్చట్లతో మొదలైన వీరి పరిచయం, ఆ తర్వాత కాలంలో గాఢమైన ప్రేమగా మారింది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, వ్యక్తిగత ఎదుగుదలలో తోడుగా ఉంటూ వచ్చిన ఈ జంట ఇప్పుడు ఒక్కటయ్యారు. ఆనాడు సెట్లో రష్మిక పంచిన ఐస్‌క్రీంల తీపి, నేడు వారి పెళ్లి సందర్భంగా పంచుతున్న స్వీట్ల రూపంలో రెట్టింపు సంతోషాన్ని ఇస్తోంది. ఈ జంట జీవితాంతం ఇలాగే సంతోషంగా ఉండాలని సినీ ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!