బెంగళూరులో అమానుష ఘటన వెలుగు చూసింది. డెలివరీ ఆలస్యం అయిందని జొమాటో డెలివరీ ఏజెంట్‌ను కొందరు యువకులు ఇష్టానురీతిగా దాడి చేశారు. ఆదివారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Kangana Ranaut: చెంపదెబ్బ వ్యాఖ్యలపై స్పందించిన కంగనా రనౌత్
ప్రస్తుత వానాకాలంలో ఎప్పుడు వాన కురుస్తుందో.. ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుందో తెలియని పరిస్థితి. ఇక మెట్రో సిటీల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. చిన్న వర్షానికి కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా ఇబ్బందులు ఉంటాయి. డెలివరీ రావాలన్నా.. ఎవరైనా ఇంటికి రావాలన్నా సమయం పడుతుంది. అయితే ఆర్డర్ చేసుకున్నది ఆలస్యంగా తీసుకొచ్చాడని జొమాటో డెలివరీ బాయ్‌ను పట్టుకుని కొందరు యువకులు మూక దాడికి పాల్పడ్డారు. చేతికి ఏది దొరికితే వాటిని తీసుకుని ఇష్టానురీతిగా బాదారు. అయితే ఈ దాడిని ఎవరో మొబైల్‌లో షూట్ చూసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: Kangana Ranaut: నా రెస్టారెంట్‌లో రూ.50 వచ్చాయి.. నా బాధ ఎవరితో చెప్పుకోను.. వరద బాధితులతో కంగనా రనౌత్ నిట్టూర్పులు
ఒక యువకుడు ప్లాస్టిక్ డబ్బా తీసుకుని డెలిబాయ్ తలపై పదే పదే కొట్టినట్లు కనిపించింది. ఇంకొక వ్యక్తి కుర్చీతో కొట్టాడు. మరొకరు బైక్‌పై కూర్చుని హంగామా చేశాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడి చేస్తూనే ఉన్నారు. అయితే పోలీసులు జోక్యం చేసుకుని డెలివరీ ఏజెంట్ నుంచి స్టేట్‌మెంట్ సేకరించారు. అలాగే దాడికి పాల్పడ్డ వారిని కూడా విచారించారు. అయితే డెలివరీ ఎగ్జిక్యూటివ్ మాత్రం అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. అయితే ఫుడ్ డెలివరీ ఆ మధ్య ఆలస్యం అవుతోందని ఒక మహిళ ఫిర్యాదు చేయగా.. జొమాటో క్షమాపణ చెప్పింది.