Papa Johns Pizza: ఎనిమిది ఏళ్ల తర్వాత.. ఇండియాకు పాపా జాన్స్ ఫిజ్జా!
- భారత దేశ ఫిజ్జా మార్కెట్లో మరింత పోటీ
- ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద పిజ్జా డెలివరీ కంపెనీ పాపా జాన్స్
- 8ఏళ్ల తర్వాత ఇండియాలో స్టోర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత దేశ ఫిజ్జా మార్కెట్లో మరింత పోటీ పెరగనుంది. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద పిజ్జా డెలివరీ కంపెనీ అయిన పాపా జాన్స్ ఇండియాలోకి తిరిగి రాబోతుంది. 8ఏళ్ల తర్వాత అమెరికాకు చెందిన ఈ కంపెనీ ఇండియాలో స్టోర్ ను ఏర్పాటు చేయనుంది. అక్టోబర్ 2025లో బెంగుళూరులో మొదటి స్టోర్ ఏర్పాటు చేయడంతో పాట.. రాబోయో పదేళ్లలో దేశం మొత్తంలో 650 స్టోర్లను స్థాపించాలని చూస్తుంది.
ప్రస్తుతం 2,200 కంటే పైగా స్టోర్లతో డొమినోస్ పిజ్జా ఆధిపత్యం చెలాయిస్తుండగా, తరువాత దేవయాని ఇంటర్నేషనల్ అండ్ సఫైర్ ఫుడ్స్ ఫ్రాంచైజీల ద్వారా సుమారు వెయ్యి స్టోర్లను పిజ్జా హట్ నడుపుతుంది. డొమినోస్ రాబోయే 3 ఏళ్లలో మరో వెయ్యి స్టార్లను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. లిటిల్ సీజర్స్ అనే పిజ్జా కంపెనీ దాదాపు 100 స్టోర్లను ఏర్పాటు చేయాలనే కాన్స్పెస్ట్ తో జులై నెలలో ఇండియాలో అడుగు పెట్టింది.
Also Read
సర్వీస్ సరిగ్గా లేని కారణంగా పాపా జాన్ 2017లో ఇండియా నుండి వైదొలగింది. ఈసారి భారతదేశంలో పాపా జాన్ కార్యకలాపాలకు పల్సర్ క్యాపిటల్ & యుఎఇకి చెందిన పిజెపి ఇన్వెస్ట్‌మెంట్స్ గ్రూప్ నాయకత్వం వహిస్తున్నాయి. అంతేకాకుండా ఇవి రెండు మాస్టర్ ఫ్రాంచైజీలుగా పనిచేస్తున్నాయి.
KFC పనీర్ జింజర్ బర్గర్‌ను, డొమినోస్ చికెన్ టిక్కా పిజ్జాను, సబ్‌వే పొటాటో-ప్యాటీ శాండ్‌విచ్‌ను అందిస్తుంది. ఈ విధానాన్ని ఫాలో అవుతూ పాపా జాన్ కూడా మెనూను భారతీయ అభిరుచులకు అనుగుణంగా మార్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే డవ్ సబ్బుల తయారీ సంస్థ హిందుస్తాన్ యూనిలీవర్, బీర్ల కంపెనీ హీనెకెన్ వంటి పెద్ద సంస్థలు భారతదేశంలో 1.4 బిలియన్ల జనాభాను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెడుతున్నాయి. ఇలాంటి కంపెనీలని చూసి పల్సర్ క్యాపిటల్ కూడా భారతదేశ భవిష్యత్తుపై నమ్మకంతో పెట్టుబడి పెడుతోంది.
తాజావార్తలు
-
YS Jagan Kurnool Tour: కర్నూలులో నేడు జగన్ పర్యటన.. పోలీసుల అనుమతి.. షరతులు ఇవే..!
-
Google Pixel 11 Series: భారత్‌లో గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ గ్రాండ్ లాంచ్.. ధరలు, ఫీచర్ల పూర్తి వివరాలు..
-
Irumbudi Trailer: రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ .. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్న మేకర్స్
-
Astrology: ఆగస్టు 13 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధనలాభం..!
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..