క్రికెట్ అభిమానులకు బీసీసీఐ అదిరిపోయే వార్త అందించింది. బీసీసీఐ పాలకమండలి ఆదివారం సాయంత్రం ఐపీఎల్ 2022 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. మార్చి 26న ఈ మెగా లీగ్ ప్రారంభం కానుంది. కరోనా పరిస్థితుల కారణంగా భారత్‌లోని రెండే నగరాల్లో లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబైలోని మూడు స్టేడియాలు, పూణెలోని ఓ స్టేడియంలో ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఐపీఎల్-15లో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి. మొత్తం 65 రోజుల పాటు…
బీసీసీఐ, విరాట్ కోహ్లీ మధ్య వివాదం నడుస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదంపై తాజాగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. సమస్య తలెత్తినప్పుడు కాయిన్‌కు ఒక వైపే చూడొద్దని.. రెండు వైపులా చూడాలని హితవు పలికాడు. సమస్యను చూస్తుంటే ముందుకు వెళ్లలేమని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. అలా చూస్తే అద్భుత విజయాలు సాధించలేమని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీతో తాను ఎన్నో ఏళ్లుగా ప్రయాణం చేశానని..…
ఈ ఏడాది ఐపీఎల్ మెగా టోర్నీ మార్చి 26న ప్రారంభం అవుతుందని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ అధికారికంగా వెల్లడించారు. ఈ సీజన్లో మొత్తం 10 జట్లు సందడి చేయనున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లో తొలిసారిగా బరిలోకి దిగబోతున్నాయి. 10 జట్లు కలిపి 74 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. వీటిలో 70 మ్యాచ్‌లు ముంబైలోని వాంఖడే స్టేడియం, బ్రబౌర్న్ స్డేడియం, నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరగనున్నాయి. వాంఖడే స్టేడియం, డీవై…
ఈ ఏడాది టీమిండియా బిజీ బిజీగా మ్యాచ్‌లు ఆడబోతోంది. ఇప్పటికే స్వదేశంలో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లు ఆడిన భారత్.. గురువారం నుంచి శ్రీలంకతో తలపడనుంది. అనంతరం ఐపీఎల్ వంటి మెగా టోర్నీ ప్రారంభం అవుతుంది. ఐపీఎల్ ముగిశాక కూడా టీమిండియా ఆటగాళ్లకు విశ్రాంతి ఉండదు. ఐపీఎల్ ముగిసిన వెంటనే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు టీ20 మ్యాచ్‌లను టీమిండియా ఆడనుంది. ఈ సిరీస్ తర్వాత భారత్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. గత ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో అర్ధంతరంగా రద్దయిన టెస్టును…
ప్రస్తుతం టీమిండియాలో వృద్ధిమాన్ సాహా వివాదం హాట్ టాపిక్‌గా మారింది. శ్రీలంకతో సిరీస్‌కు సాహాను సెలక్టర్లు పక్కన పెట్టగా… అతడి ఇంటర్వ్యూ కోసం ఓ జర్నలిస్టు బెదిరించడం రచ్చ రేపుతోంది. దీనిపై బీసీసీఐ రంగంలోకి దిగిందని.. దర్యాప్తు చేపట్టిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వివాదంపై సాహా స్వయంగా స్పందించాడు. ఇప్పటివరకు తనను బీసీసీఐ సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చాడు. ఒకవేళ తనను సంప్రదించినా.. బెదిరించిన జర్నలిస్టు పేరును బీసీసీఐకి చెప్పదలుచుకోలేదని వివరించాడు. తాను ఒకరి కెరీర్ నాశనం…
టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను బీసీసీఐ సెలక్టర్ పరోక్షంగా హెచ్చరించారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భువనేశ్వర్‌కుమార్ రాణించకుంటే పుజారా, రహానే మాదిరి జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉందని ఆయన హితవు పలికారు. దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత బీసీసీఐ టెస్టు జట్టులోని సీనియర్ ఆటగాళ్లు పుజారా, రహానే, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహాలపై వేటు పడిందని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ భువనేశ్వర్‌కు కూడా డెత్ సిరీస్ అని భావించొచ్చన్నారు.…
ఈనెలాఖరులో భారత్‌లో శ్రీలంక జట్టు పర్యటించనుంది. ఈ మేరకు టీమిండియాతో మూడు టీ20లతో పాటు రెండు టెస్టులను శ్రీలంక ఆడనుంది. అయితే తొలుత షెడ్యూల్ ప్రకారం తొలుత టెస్టులు, తర్వాత టీ20లు జరగాల్సి ఉంది. కానీ సవరించిన షెడ్యూల్ ప్రకారం ముందుగా టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా రెండు టెస్టులు నిర్వహించనున్నారు. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను మంగళవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. ఫిబ్రవరి 24న తొలి టీ20, ఫిబ్రవరి 26న…
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో త్వరలో జరగనున్న ఐపీఎల్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఐపీఎల్-2022 ఇండియాలో జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ మరోసారి స్పష్టం చేశాడు. కరోనా పరిస్థితి చేయిదాటితే తప్ప ఈ సారి ఐపీఎల్‌ను ఇండియాలోనే నిర్వహిస్తామని తెలిపాడు. ముంబై, పూణెలలో లీగ్ మ్యాచ్‌లను జరుపుతామని… అహ్మదాబాద్ వేదిక గురించి ఇంకా ఆలోచించలేదని పేర్కొన్నాడు. Read Also: విండీస్‌తో సిరీస్‌కు ముందు షాక్.. టీమిండియా క్రికెటర్లకు కరోనా ఏప్రిల్, మే నెలల్లో ఇండియాలో కరోనా…
భారత క్రికెట్లో ఇప్పుడిప్పుడే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వివాదం సద్దుమణుగుతోంది. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై సెలక్షన్ కమిటీతో పాటు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీపై వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అది మరవకముందే గంగూలీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. చివరకు ఈ వివాదం గంగూలీకి రోజులు దగ్గరపడ్డాయని క్రికెట్ అభిమానులు చర్చించుకునే స్థాయికి వెళ్లింది. అసలు విషయంలోకి వెళ్తే… బీసీసీఐ నిబంధనల ప్రకారం బీసీసీఐ అధ్యక్షుడు టీమ్ సెలక్షన్ కమిటీ సమావేశాలకు వెళ్లకూడదు. అయినప్పటికీ గంగూలీ…
ఐపీఎల్ 2022 వేలానికి రంగం సిద్ధమైంది. ఈ మెగా వేలానికి కర్ణాటక రాజధాని బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో రెండు రోజుల పాటు ఐపీఎల్ మెగా వేలం ప్రక్రియను బీసీసీఐ నిర్వహించనుంది. కర్ణాటక ప్రభుత్వం కోవిడ్-19 పరిమితులను ఎత్తివేసిన నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ కోసం హోటల్ బుకింగ్ ప్రక్రియను బీసీసీఐ ప్రారంభించింది. తాజాగా ఐపీఎల్ పాలకమండలి వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. Read Also: స్వదేశంలో భారత్‌ను ఓడించే…