Mithali Raj: రిటైర్మెంట్ తర్వాత ఆ పని చేయడానికి నేను సిద్ధంగా వున్నాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల క్రికెట్ లో ఆమె ఒక సచిన్ టెండూల్కర్ . ఇప్పుడున్న ప్రతీ మహిళా క్రికెటర్ కూడా ఆమెను చూసే క్రికెటర్ అవ్వాలని అనుకున్నారు. అంతర్జాతీయ మహిళా క్రికెట్ లో ఆమెకు తిరుగు లేదు. ఆమె మరెవరో కాదు దిగ్గజ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ . అయితే తాజాగా క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆమె .. అవకాశం వస్తే కచ్చితంగా క్రికెట్ పాలకురాలిగా మారతానని మిథాలీ రాజ్ అంటోంది. మహిళల క్రికెట్ గురించి వారికే ఎక్కువ తెలుస్తుందని పేర్కొంది. బెలిండా క్లార్క్, కానర్ తరహాలో తానూ రాణిస్తానని ధీమా వ్యక్తం చేసింది. రిటైర్మెంట్ తర్వాతి ప్రణాళికలను ఆమె వివరించింది.
బీసీసీఐ పాలక మండలిలో చేరడం తనకిష్టమేనని మిథాలీ తెలిపింది. వేర్వేరు దశల్లో మహిళల జట్టును నడిపించిన అనుభవం తనకుందని వివరించింది. అదే పాలకురాలిగా తనకు ఉపయోగపడుతుందని విశ్వాసంతో ఉంది.
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
‘అవును, పాలకురాలిగా మారడం నాకిష్టమే. అవకాశం వస్తే కచ్చితంగా చేపడతాను. మహిళా క్రికెటర్‌గా ఎంతో అనుభవం ఉంది. క్రీడాకారిణిగా ఎన్నో దశలను చూశాను. ఆ అనుభవం కచ్చితంగా ఉపయోగపడుతుంది’ అని మిథాలీ తెలిపింది.
‘మహిళల క్రికెట్ గురించి మహిళలే బాగా అర్థం చేసుకుంటారు. అందుకే బోర్డులో వారికి కచ్చితమైన ఓ పొజిషన్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కొన్నేళ్లుగా వారు జట్టులో, క్రికెట్లో కొనసాగారు. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ను బెలిండా క్లార్క్ తన అనుభవంతో మెరుగుపరిచింది. ఈసీబీలో క్లేర్ కానార్ ఇదే దారి అనుసరించింది. అందుకే అమ్మాయిల క్రికెట్‌కు పరిపాలనలో మహిళలు మెరుగ్గా రాణించగలరని నా నమ్మకం’ అని మిథాలీ వివరించింది.
“మైదానంలోని అడుగు పెట్టిన ప్రతిసారీ నేను అత్యుత్తమంగా ఆడేందుకే ప్రయత్నించాను. భారత్‌ను గెలిపించేందుకే కష్టపడ్డాను. మువ్వన్నెల జెండాను రెపరెపలాడించేందుకు ప్రయత్నించాను. ప్రస్తుతం జట్టు ప్రతిభావంతులైన యువ క్రికెటర్ల చేతుల్లో ఉంది. భారత మహిళల క్రికెట్ జట్టు భవిష్యత్తు బాగుంటుందని తెలుసు. అందుకే నా ప్రయాణం ముగించేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నాను’ అని మిథాలీ పేర్కొంది.
మహిళల క్రికెట్లో ఎవరెస్టు శిఖరం మిథాలీ రాజ్. కెరీర్లో ఆమె సాధించని రికార్డుల్లేవ్. అందుకోని ఘనతల్లేవ్. 23 ఏళ్లుగా అమ్మాయిల క్రికెట్‌కు సేవలందిస్తున్న ఈ టీమ్‌ఇండియా దిగ్గజం రెండు రోజుల క్రితమే వీడ్కోలు ప్రకటించింది. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసింది. ప్రస్తుతం భారత మహిళల క్రికెట్ పగ్గాలు ప్రతిభావంతుల చేతుల్లోనే ఉన్నాయని వెల్లడించింది. తనకు అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసింది.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!