Cricket: ప్రపంచం ఓ వైపు.. టీమిండియా మరోవైపు.. మ్యాచ్ నిర్వహణకు కేంద్రం సన్నాహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం క్రికెట్ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. విదేశాలకు చెందిన ప్రముఖ ఆటగాళ్లు ఓ జట్టుగా, అగ్రశ్రేణి భారత ఆటగాళ్లు మరో జట్టుగా మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐకి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఇండియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ మధ్య ఆగస్టు 22న మ్యాచ్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు మ్యాచ్ నిర్వహణపై బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులు వెల్లడించారు.
Read Also: Wimbledon: ఏడోసారి.. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేత జొకోవిచ్
Also Read
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
- Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
అయితే అంతర్జాతీయ ఆటగాళ్లతో మ్యాచ్ నిర్వహించాలంటే చాలా తతంగం ఉంటుందని బీసీసీఐ అధికారులు అంటున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ షెడ్యూల్ చూసుకుని ఈ మ్యాచ్ నిర్వహణపై ఐసీసీతో మాట్లాడాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో కేంద్రం ప్రతిపాదనపై ఇంకా చర్చ జరుగుతోందని తెలిపారు. కేంద్రం ఈ మ్యాచ్ నిర్వహించాలని కోరుతున్న సమయంలో ఇంగ్లీష్ దేశవాళీ క్రికెట్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ జరగనుందని గుర్తు చేశారు. అయితే భారత ఆటగాళ్లు మాత్రం ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఒకవేళ ఈ మ్యాచ్ నిర్వహణ సాధ్యమైతే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!