BCCI: ఈనెల 18తో బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శుల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎవరిని ఎన్నుకుంటారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుత కార్యదర్శి, కేంద్రమంత్రి అమిత్ షా కుమారుడు జై షా తదుపరి బీసీసీఐ అధ్యక్షుడు అని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశంలో కర్ణాటక…
Team India: ఈ ఏడాది టీ20ల్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. 2022లో జరిగిన అన్ని ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ల్లో భారత్ విజయాలు సాధించింది. అటు స్వదేశంలో, ఇటు విదేశాల్లో జరిగిన అన్ని టీ20 సిరీస్‌లను ఓటమి అనేది లేకుండా ముగించింది. వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో టీ20 సిరీస్‌లు సొంతం చేసుకుని ఐసీసీ ర్యాంకుల్లో నంబర్ వన్ జట్టుగా కొనసాగుతోంది. ద్వైపాక్షిక సిరీస్‌లలో ఓటమి అనేది లేకుండా సాగుతున్న టీమిండియా ఆసియా కప్‌లో…
టీమిండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతూ టీ20 వరల్డ్ కప్‌కు దూరమయ్యాడంటూ వచ్చిన కథనాలపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. బుమ్రా టీ20 వరల్డ్ కప్‌కు దూరం కాలేదని స్పష్టం చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తన కుమారుడైన బీసీసీఐ సెక్రటరీ జై షాపై సీరియస్ అయ్యారు… ఇటీవల, ఒక వీడియో చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది.. తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వైరల్ అయిన ఆ వీడియోలో హోంమంత్రి అమిత్ షా తన కుటుంబంతో కలిసి ప్రార్థనలు చేస్తున్నట్టు ఉన్న దృశ్యాన్ని చూడవచ్చు. అమిత్‌షా పక్కనే నిలబడిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సెక్రటరీ జై షాను కూడా మీరు చూడవచ్చు. అయితే,…
BCCI Elections: బీసీసీఐ ఎన్నికలకు నగరా మోగింది. ఈ మేరకు ఆదివారం నాడు బీసీసీఐ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. బీసీసీఐ ఆఫీసు బేరర్ల పదవుల కోసం అక్టోబరు 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబరు 18న ముంబైలో ఎన్నికలు జరగనుండగా, ఫలితాలు అదే రోజున అధికారులు వెల్లడిస్తారు. ప్రస్తుతం బీసీసీఐకి అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, కార్యదర్శిగా జై షా వ్యవహరిస్తున్నారు. అయితే గంగూలీ ఐసీసీ చైర్మన్ పదవిని చేపట్టే అవకాశం ఉందని, జై షా బీసీసీఐ…
Rahul Dravid: ఆసియా కప్, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో టీమిండియా పేలవ ప్రదర్శన భారత అభిమానులకు కలవరపరుస్తోంది. ముఖ్యంగా టీమ్ పేలవమైన బౌలింగ్ ప్రదర్శనతో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీంతో రాబోయే టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని టీమ్‌కు మరిన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు, వార్మప్ మ్యాచ్‌లు నిర్వహించడం మేలని కోచ్ రాహుల్ ద్రవిడ్ భావిస్తున్నాడు. ఈ మేరకు ఆస్ట్రేలియాలో ఎక్కువ వార్మప్ మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐని కోరాడు. ద్రవిడ్ విజ్ఞప్తితో పాటు అభిమానుల…
వచ్చే ఏడాది ఆరంభంలో మహిళల ఐపీఎల్‌ను ప్రారంభించాలని బోర్డు భావిస్తోందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మంగళవారం అన్ని రాష్ట్ర సంఘాలకు తెలిపారు. 2022-23 కోసం స్వదేశీ అంతర్జాతీయ, దేశీయ సీజన్‌పై ముఖ్యమైన అంశాలను వివరిస్తూ గంగూలీ అన్ని రాష్ట్ర సంఘాలకు లేఖ రాశారు.
BCCI: వచ్చేనెలలో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా జట్టును సెలక్టర్లు ప్రకటించారు. అయితే ప్రధాన బౌలర్ షమీని స్టాండ్ బైగా ప్రకటించడం విమర్శలకు తావిచ్చింది. షమీని ఎందుకు తుది జట్టులోకి తీసుకోలేదని విమర్శకులు బీసీసీఐపై దుమ్మెత్తిపోశారు. తాజాగా షమీని తుది జట్టులోకి తీసుకోకపోవడానికి గల కారణాలను బీసీసీఐ సెలక్టర్ వెల్లడించారు. మహమ్మద్ షమీ స్టాండ్‌బైగా ఉన్నా దాదాపు తుది జట్టులో ఉన్నట్లేనని ఆయన స్పష్టం చేశారు. గాయాలతో…
BCCI: బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ, సెక్రటరీ జైషాలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. మరో మూడేళ్లు పాటు తమ పదవుల్లో కొనసాగేందుకు రూట్ క్లియర్ చేసింది. బీసీసీఐ ఆఫీస్ బేరర్లకు సంబంధించిన కూలింగ్ పీరియడ్ రూల్ తొలగించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ చేసిన రాజ్యాంగ సవరణలకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. స్టేట్ అసోసియేషన్‌లో ఆరేళ్లు, బీసీసీఐలో ఆరేళ్లు సహా ఆఫీస్ బేరర్లు 12 ఏళ్ల పాటు నిరంతర పదవీకాలం కలిగి ఉండవచ్చని…
Ravindra Jadeja: ఆసియా కప్‌లో గ్రూప్ స్టేజీలో రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత రవీంద్ర జడేజా ఉన్నట్టుండి గాయపడ్డాడు. దీంతో అతడు ఆసియా కప్‌కే కాకుండా టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అతడు మ్యాచ్‌లో గాయపడకుండా కేవలం టీమ్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతోనే గాయపడినట్లు తెలుస్తోంది. గ్రూప్ స్టేజీలో హాంకాంగ్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత రిలాక్సేషన్ కోసం దుబాయ్‌లోని సముద్ర జలాల్లో ఓ సాహస కృత్యం చేయబోయి జడేజా గాయపడినట్లు సమాచారం అందుతోంది. అ…