World Cup 2023: 2023 అక్టోబర్ నుంచి వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఇండియాలో ప్రారంభం కావాలి. అయితే ఈ టోర్నీ నిర్వహణపై ఇప్పుడు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వన్డే వరల్డ్ కప్ 2023కి భారత్ ఆతిథ్యమవ్వనున్న నేపథ్యంలో.. వరల్డ్ కప్ భారత్ నుంచి తరలిపోతుందనే వార్త టీమిండియా అభిమానులను కలవరపెడుతోంది. వన్డే ప్రపంచకప్ మరోసారి స్వదేశంలో జరుగుతుండడంతో మ్యాచ్‌లు ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కుతుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అభిమానుల ఆశలు ఆవిరయ్యేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఆతిథ్యం భారత్ నుంచి తరలిపోయే అవకాశం ఉంది. భారత ప్రభుత్వానికి పన్నుల చెల్లింపు విషయమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అయితే ఈ ప్రపంచకప్ కోసం భారత్ ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు పొందాలని ఐసీసీ బీసీసీఐని కోరింది.
National Sports Meet: అట్టహాసంగా ప్రారంభమైన జాతీయ స్పోర్ట్స్ మీట్ 2022
వన్డే ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే దేశాలు ఆ దేశ ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపులను పొందాలని గతంలో ఐసీసీలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయంలో భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి పురోగతీ లేదు. దీంతో పన్ను చెల్లింపు విషయంలో తాము ఏమీ చేయలేమని, అవసరమైతే టోర్నమెంట్‌ను భారత్‌లో కాకుండా ఇతర చోట నిర్వహించుకోవచ్చని ఐసీసీకి బీసీసీఐ తెలియజేసినట్లు సమాచారం. 2016 టీ20 ప్రపంచకప్ భారత్‌లో జరిగింది. అప్పుడు కూడా భారత ప్రభుత్వం ఐసీసీకి పన్ను మినహాయింపులు ఇవ్వడానికి నిరాకరించింది. ఈసారి కూడా పన్ను మినహాయింపుకు ప్రభుత్వం ఒప్పుకోకపోతే వన్డే వరల్డ్‌కప్ భారత్ నుంచి తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్ 2011లో చివరగా వన్డే ప్రపంచకప్ జరగగా.. ధోనీ సారథ్యంలో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. ఈ వివాదం త్వరగా ముగిసి ఇండియాలోనే వరల్డ్ కప్ జరగాలని అభిమానులు ఎదురుచూస్తు్న్నారు.