Himanta Biswa Sarma: భారతదేశం వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన “చికెన్ నెక్ కారిడార్”పై తరచూ బెదిరింపులు చేస్తున్న వారికి కౌంటర్‌గా అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ బంగ్లాదేశ్‌పై మండిపడ్డారు. భారత్‌కు ఒక్క చికెన్ నెక్ ఉంటే, బంగ్లాదేశ్‌కు రెండు ఉన్నాయని.. అవి భారతదేశంతో పోలిస్తే చాలా అసురక్షితమని ఆయన అన్నారు. ‘సిలిగురి కారిడార్’ అనేది పశ్చిమ బెంగాల్‌లో ఉన్న సన్నని భూభాగం. దీని వెడల్పు సగటున 22 నుండి 35 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. ఈ కారిడార్ ద్వారానే ఈశాన్య భారతదేశం మిగతా దేశంతో భూభాగాల ద్వారా కనెక్ట్ అవుతుంది.
Read Also: Karnataka: 18 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేత.. స్పీకర్ ఉత్తర్వులు..!
ఇకపోతే ఈ విషయమై హిమంత శర్మ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్న ప్రకారం, బంగ్లాదేశ్‌లో రెండు చికెన్ నెక్స్ ఉన్నట్లు సూచించారు. ఇందులో మొదటి చికెన్ నెక్ గా.. దక్షిణ దినాజ్‌పూర్ (భారత్) నుంచి సౌత్ వెస్ట్ గారో హిల్స్ (మెఘాలయ) మధ్య ఉన్న 80 కిలోమీటర్ల ఉత్తర బంగ్లాదేశ్ కారిడార్. ఇక్కడ ఏవైనా అంతరాయాలు ఏర్పడితే, రంగ్‌పూర్ డివిజన్ మొత్తం బంగ్లాదేశ్ మిగతా దేశభాగాల నుంచి పూర్తిగా విడిపోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు. అలాగే రెండో చికెన్ నెక్ దక్షిణ త్రిపురా నుంచి బంగాళాఖాతానికి దారి తీసే 28 కిలోమీటర్ల చిట్టగాంగ్ కారిడార్ గా వివరించారు. ఇది బంగ్లాదేశ్ ఆర్థిక రాజధాని చిట్టగాంగ్‌ను, రాజకీయ రాజధాని ఢాకాతో కలిపే ఏకైక మార్గం అంటూ వివరించారు.
Read Also: Pat Cummins: ఈ ఏడాది మాది కాదు.. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
To those who habitually threaten India on the “Chicken Neck Corridor”, should note these facts as well:
1️⃣ Bangladesh has two of its own “chicken necks”. Both are far more vulnerable
2️⃣ First is the 80 Km North Bangladesh Corridor- from Dakhin Dinajpur to South West Garo… pic.twitter.com/DzV3lUAOhR
— Himanta Biswa Sarma (@himantabiswa) May 25, 2025
మన దేశంలోని సిలిగురి కారిడార్ లాగే, బంగ్లాదేశ్‌కు కూడా రెండు సన్నని కారిడార్లు ఉన్నాయి. వాటి ప్రాధాన్యతను కొంతమంది మరిచిపోతున్నారు. అందుకే నేను ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానని శర్మ తెలిపారు. ఇటీవల చైనా పర్యటనలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్, నోబెల్ బహుమతి విజేత ముహమ్మద్ యునూస్ మాట్లాడుతూ.. భారత ఈశాన్య రాష్ట్రాలు “ల్యాండ్ లాక్” అయ్యాయని, బంగ్లాదేశ్ వారికి “ఓషన్ గార్డియన్” అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై హిమంత శర్మ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ బంగ్లాదేశ్‌దే అసలైన అసురక్షిత స్థితి అని వివరించారు.
The statement made by Md Younis of Bangladesh so called interim Government referring to the seven sister states of Northeast India as landlocked and positioning Bangladesh as their guardian of ocean access, is offensive and strongly condemnable. This remark underscores the…
— Himanta Biswa Sarma (@himantabiswa) April 1, 2025