Muhammad Yunus: షేక్ హసీనాను అప్పగించమంటే మోడీ ఏమన్నారంటే..! యూనస్ కీలక వ్యాఖ్యలు
- ప్రధాని మోడీపై ముహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు
- బిమ్‌స్టెక్ సదస్సులో మాట్లాడిన సంభాషణను బయటపెట్టిన యూనస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ గురించి బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత ముహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని అడిగితే మోడీ అంగీకరించలేదని తెలిపారు. గతేడాది పెద్ద ఎత్తున బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఉద్యమం జరిగింది. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీంతో షేక్ హసీనా దేశాన్ని వదిలి భారత్‌కు వచ్చేశారు. అనంతరం నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఎన్నికయ్యారు. అనంతరం షేక్ హసీనాను బంగ్లాదేశ్ రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు.
ఇది కూడా చదవండి: A.A. Arts Mahendra : సీనియర్ నిర్మాత ఎ .ఎ. ఆర్ట్స్ మహేంద్ర కన్నుమూత
Also Read
- 22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
తాజాగా లండన్‌లోని చాఠమ్ హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో యూనస్ మాట్లాడారు. భారత్‌లో నివాసం ఉంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని ప్రధాని మోడీని అడిగితే అందుకు అంగీకరించలేదని పేర్కొన్నారు. హసీనాను కట్టడి చేయాలని కోరగా అందుకు కూడా అంగీకరించలేదని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Rains : తెలంగాణలో జూన్ 15 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
బిమ్‌స్టెక్ సదస్సులో ప్రధాని మోడీతో షేక్ హసీనా గురించి మాట్లాడానని.. ఆన్‌లైన్‌లో హసీనా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని.. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారని తెలియజేసినట్లు చెప్పారు. ఆమె ప్రకటనలు, ప్రసంగాలు అడ్డుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. అందుకు మోడీ.. అది సోషల్ మీడియా.. దాన్ని నియంత్రించడం సాధ్యం కాదని చెప్పినట్లు వెల్లడించారు.
షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించేందుకు సుముఖంగా లేనట్లు కనిపిస్తోందని చెప్పారు. ఇప్పటికే భారత్‌కు లేఖ రాశామని.. ఇప్పటికీ చట్టపరమైన చర్యలు జరుగుతున్నాయని వెల్లడించారు. హసీనా చేసిన నేరాలకు నోటీసులు కూడా పంపించామని.. ఆమెకు సంబంధించిన నేరాలు ఇంకా వస్తూనే ఉన్నాయని తెలిపారు. చట్టబద్ధంగానే ఆమెను బంగ్లాదేశ్‌కు తీసుకురావాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. పొరుగు దేశమైన భారత్‌తో మంచి సంబంధాలు ఉండాలనే కోరుకుంటున్నామని.. కానీ భారత పత్రికలు నకిలీ వార్తలు సృష్టిస్తున్నాయని యూనస్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
-
BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
-
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
-
BCCI: కోచ్‌గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!