A thief called the police fearing a mob attack in Bangladesh: బంగ్లాదేశ్ లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ దొంగ పోలీసులకే ఫోన్ చేసి షాకిచ్చాడు. తనను రక్షించాలని పోలీసులను వేడుకున్నాడు. దొంగతనం చేసి తప్పించుకునే క్రమంలో స్థానిక గుంపుకు చిక్కుతాననే భయంతో తనను కాపాడాలని కోరాడు. కోపంతో ఉన్న గుంపు తనను కొట్టి చంపేస్తాడని భావించిన దొంగ పోలీసుల హెల్ప్ కోరాడు. బంగ్లాదేశ్ దక్షిణ బారిసల్ నగరంలో మూసి ఉన్న…
Attack on Hindu Temple in bangladesh: బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు ఆగడం లేదు. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ మతఛాందసవాదులు తరుచుగా హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు చేస్తున్నారు. ప్రధాని షేక్ హసీనా మైనారిటీల రక్షణకు కట్టుబడి ఉంటామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం వేరేలా ఉంటున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ లో అత్యంత పురాతనమైన హిందూ ఆలయంపై దాడి చేశారు దుండగులు. దేవీ దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు.
Gold seizure in Delhi: ఢిల్లీలో భారీగా బంగారం పట్టుబడింది. ఈశాన్య ఢిల్లీలో డీఆర్ఐ అధికారులు రూ.33.40 కోట్ల విలువ చేసే 65.46 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. ఐజ్వాల్ నుంచి ముంబాయి వెళ్తున్న ఓ భారీ కంటైనర్ లో బంగారాన్ని గుర్తించిన పాట్నా, ఢిల్లీ, ముంబాయి డీఆర్ఐ స్పెషల్ టీములు గుర్తించాయి. గోనే సంచుల్లో బంగారం తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు పక్కా ప్లాన్ తో గోల్డ్ స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేశారు.
Bangladesh: బంగ్లాదేశ్ లో విద్యుత్ గ్రిడ్ వ్యవస్థ కుప్పకూలింది. మంగళవారంనాడు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నేషనల్ పవర్ గ్రిడ్ ఫెయిల్ కావడంతో దేశవ్యాప్తంగా సుమారు 14 కోట్ల మందికి కరెంట్ లేకుండా పోయింది.
బంగ్లాదేశ్‌లోని పంచగఢ్ జిల్లాలో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. పడవ బోల్తా పడిన ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ప్రయాణికులు నదిలో గల్లంతైనట్లు తెలుస్తోంది.
PM Sheikh Hasina on Rohingya issue: రోహింగ్యాలను స్వేదేశానికి వెళ్లేలా సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ దేశాలను కోరారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. రోహింగ్యాల సమస్య ఈ ప్రాంతంలో స్థిరత్వం, భద్రతపై ప్రభావం చూపిస్తోందని శనివారం ఆమె యూఎన్ లో అన్నారు. మయన్మార్ లో కొనసాగుతున్న రాజకీయ హింస, సాయుధపోరాటాలు రోహింగ్యాలను స్వదేశానికి తరలించడాన్ని క్లిష్టతరం చేసిందని ఆమె అన్నారు. ఈ విషయంలో యూఎన్ సమర్థవంతమైన పాత్ర పోషిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం…
Bangladesh: అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో రిటైర్మెంట్ల హవా నడుస్తోంది. తాజాగా బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ రూబెల్ హుస్సేన్(32) టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఫేస్బుక్లో తన రిటైర్మెంట్ గురించి పోస్ట్ చేశాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం కొనసాగుతానని రూబెల్ హుస్సేన్ స్పష్టం చేశాడు. 2009లో వెస్టిండీస్‌తో తొలిసారి టెస్ట్ మ్యాచ్ ఆడిన రూబెల్.. చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో పాకిస్థాన్‌తో రావల్పిండిలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆడాడు. ఈ టెస్ట్…
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గురువారం రాజస్థాన్‌లో ఆమెకు స్వాగతం పలికేందుకు జైపూర్ విమానాశ్రయానికి తరలివచ్చిన స్థానిక కళాకారులతో ముచ్చటించారు. రాజస్థానీ కళాకారులతో కలిసి నృత్యం చేశారు.