Attack on Hindu Temple in bangladesh: బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు ఆగడం లేదు. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ మతఛాందసవాదులు తరుచుగా హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు చేస్తున్నారు. ప్రధాని షేక్ హసీనా మైనారిటీల రక్షణకు కట్టుబడి ఉంటామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం వేరేలా ఉంటున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ లో అత్యంత పురాతనమైన హిందూ ఆలయంపై దాడి చేశారు దుండగులు. దేవీ దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు.
Gold seizure in Delhi: ఢిల్లీలో భారీగా బంగారం పట్టుబడింది. ఈశాన్య ఢిల్లీలో డీఆర్ఐ అధికారులు రూ.33.40 కోట్ల విలువ చేసే 65.46 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. ఐజ్వాల్ నుంచి ముంబాయి వెళ్తున్న ఓ భారీ కంటైనర్ లో బంగారాన్ని గుర్తించిన పాట్నా, ఢిల్లీ, ముంబాయి డీఆర్ఐ స్పెషల్ టీములు గుర్తించాయి. గోనే సంచుల్లో బంగారం తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు పక్కా ప్లాన్ తో గోల్డ్ స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేశారు.
Bangladesh: బంగ్లాదేశ్ లో విద్యుత్ గ్రిడ్ వ్యవస్థ కుప్పకూలింది. మంగళవారంనాడు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నేషనల్ పవర్ గ్రిడ్ ఫెయిల్ కావడంతో దేశవ్యాప్తంగా సుమారు 14 కోట్ల మందికి కరెంట్ లేకుండా పోయింది.
బంగ్లాదేశ్‌లోని పంచగఢ్ జిల్లాలో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. పడవ బోల్తా పడిన ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ప్రయాణికులు నదిలో గల్లంతైనట్లు తెలుస్తోంది.
PM Sheikh Hasina on Rohingya issue: రోహింగ్యాలను స్వేదేశానికి వెళ్లేలా సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ దేశాలను కోరారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. రోహింగ్యాల సమస్య ఈ ప్రాంతంలో స్థిరత్వం, భద్రతపై ప్రభావం చూపిస్తోందని శనివారం ఆమె యూఎన్ లో అన్నారు. మయన్మార్ లో కొనసాగుతున్న రాజకీయ హింస, సాయుధపోరాటాలు రోహింగ్యాలను స్వదేశానికి తరలించడాన్ని క్లిష్టతరం చేసిందని ఆమె అన్నారు. ఈ విషయంలో యూఎన్ సమర్థవంతమైన పాత్ర పోషిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం…
Bangladesh: అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో రిటైర్మెంట్ల హవా నడుస్తోంది. తాజాగా బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ రూబెల్ హుస్సేన్(32) టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఫేస్బుక్లో తన రిటైర్మెంట్ గురించి పోస్ట్ చేశాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం కొనసాగుతానని రూబెల్ హుస్సేన్ స్పష్టం చేశాడు. 2009లో వెస్టిండీస్‌తో తొలిసారి టెస్ట్ మ్యాచ్ ఆడిన రూబెల్.. చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో పాకిస్థాన్‌తో రావల్పిండిలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆడాడు. ఈ టెస్ట్…
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గురువారం రాజస్థాన్‌లో ఆమెకు స్వాగతం పలికేందుకు జైపూర్ విమానాశ్రయానికి తరలివచ్చిన స్థానిక కళాకారులతో ముచ్చటించారు. రాజస్థానీ కళాకారులతో కలిసి నృత్యం చేశారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో పర్యటిస్తోన్న వేళ కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను విమర్శించే క్రమంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ను విమర్శించే క్రమంలో బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లను తిరిగి మన దేశంలో కలపాలంటూ ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది.
PM Sheikh Hasina India Visit: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇండియాలోొ పర్యటిస్తున్నారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు షేక్ హసీనా. ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకోవడానికి పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రధాని మోదీ, షేక్ హసీనాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. వచ్చే 25 ఏళ్లలో భారత్-బంగ్లా సంబంధాలు సరికొత్త స్థాయికి చేరుకుంటాయని ప్రధాని మోదీ అన్నారు. బంగ్లాదేశ్ నుంచి ఎగుమతులకు భారతదేశం అతిపెద్ద మార్కెట్ అని మోదీ…
Mushfiqur Rahim: ఆసియా కప్‌లో ఘోరంగా విఫలమైన బంగ్లాదేశ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ ముష్ఫీకర్ రహీమ్ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేలు, టెస్ట్ ఫార్మాట్లపై పూర్తి దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అతడు వెల్లడించాడు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తన నిర్ణయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఆసియా కప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన ముష్ఫీకర్ రహీమ్ మొత్తం ఐదు పరుగులు…