Rohingya Refugees Boat Reached Indonesia After A Month: ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నెల రోజుల పాటు రోహింగ్యా శరణార్థులు సముద్రంలో చిక్కుకుపోయారు. పొట్ట చేత పట్టుకొని పొరుగు దేశాలకు వలస వెళ్లిన ఈ రొహింగ్యాలు.. సముద్ర మార్గం ద్వారా తమ ప్రయాణాన్ని ఎంపిక చేసుకున్నారు. అయితే.. మధ్యలోనే ఇంజిన్ పని చేయకపోవడంతో, నడి సముద్రంలో వాళ్లు చిక్కుకున్నారు. ఇంజిన్‌ని తిరిగి స్టార్ట్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. పోనీ.. అటుగా ఏవైనా పడవలొచ్చి తమని రక్షిస్తాయనుకుంటే, అదీ లేదు. చుట్టూ సముద్రపు నీరే. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేవు. ఇక తమని ఆ దేవుడే కాపాడాలంటూ.. ఆ పడవలో నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. చివరికి గాలుల పుణ్యమా అని.. ఆ పడవ అటూఇటూ కొట్టుకుపోతూ ఇండోనేషియా తీరానికి చేరుకుంది.
Anuraj Thakur: ఇంకా 1962లోనే ఉన్నారంటూ.. రాహుల్‌పై అనురాగ్ కౌంటర్
మొత్తం 57 మంది రొహింగ్యాలతో కూడిన ఆ పడవ.. ఇండోనేషియాలోని అషే బేసర్ తీరానికి చేరుకుంది. ఇంజిన్ పాడవ్వడంతో.. నెల రోజుల పాటు తాము అండమాన్ సముద్రంలోనే తిండి, నీరు లేక కొట్టుమిట్టాడామని ఆ రోహింగ్యాలు చెప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ శరణార్థులను ప్రభుత్వ ఆవాసంలో తాత్కాలికంగా స్థావరం కల్పించామని అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారు తెలిపారు. సుదీర్ఘ ప్రయాణం చేయడంతో పాటు.. నెల రోజుల పాటు సముద్రంలో చిక్కుకుపోవడంతో వాళ్లు ఆహారం లేక బలహీనంగా మారారని, డీహైడ్రేషన్ బారిన పడ్డారని చెప్పారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నామన్నారు. అయితే.. ఈ రొహింగ్యాలు ఎక్కడి నుంచి వచ్చారన్న విషయం ఇంకా తేలాల్సి ఉందన్నారు. సోమవారం సాయంత్రం కూడా 186 మంది రొహింగ్యాలతో కూడిన మరొక పడవ కూడా అసెహ్ తీరానికి వచ్చి చేరింది. వారికి కూడా ఎమర్జెన్సీ సేవలు అందించినట్టు ఆ అధికారి వెల్లడించారు.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
కాగా.. వాస్తవానికి ఈ రొహింగ్యాలందరూ మయన్మార్‌లో నివసిస్తుంటారు. అయితే.. అక్కడ సైన్యం మారణహోమం నుంచి తప్పించుకునేందుకు లక్షలాది రొహింగ్యాలు 2017లో తరలిపోయారు. అక్కడ కూడా పరిస్థితులు క్షీణించడంతో.. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వలసబాట పట్టారు. ఈ క్రమంలోనే సముద్ర మార్గాన్ని ఎంపిక చేసుకున్నారు.