Kuwait Woman: భారత్‌లో అదృశ్యమైన కువైట్ మహిళ.. బంగ్లాదేశ్‌లో ఆచూకీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kuwait Woman: చికిత్స కోసం భారత్‌కు వచ్చిన కువైట్‌కు చెందిన మహిళ(31) గత నెలలో కోల్‌కతా నుంచి తప్పిపోయింది. ఈ వారం పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో సదరు మహిళ ఉన్నట్లు ఆచూకీ లభ్యమైంది ఓ పోలీసు అధికారి వెల్లడించారు. క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన తర్వాత, కోల్‌కతా పోలీసులు కువైట్ ఎంబసీకి సమాచారం అందించారు. ఒక వ్యక్తితో పాటు మహిళ బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించడానికి అంతర్జాతీయ సరిహద్దును దాటింది. అప్పుడు కువైట్ రాయబార కార్యాలయం బంగ్లాదేశ్ సహాయం కోరింది. సోమవారం ఆ దేశంలోని ఒక ఇంటి నుండి మహిళను కనుగొని అక్కడి పోలీసులు ఆమెను కువైట్ అధికారులకు అప్పగించారని పోలీసు అధికారి తెలిపారు.
ఆ మహిళ జనవరి 20న తన తమ్ముడితో కలిసి కోల్‌కతాకు వచ్చి తూర్పు కోల్‌కతాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేసింది. కొన్ని చర్మ సంబంధిత సమస్యలతో ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కోల్‌కతాలోని ఇతర పర్యాటక ఆకర్షణలను సందర్శించిన తర్వాత, ఆమె తన తమ్ముడితో కలిసి జనవరి 27న అలీపూర్ జంతుప్రదర్శనశాలకు వెళ్లి అక్కడ నుంచి ఆమె తప్పిపోయిందని అధికారి వెల్లడించారు.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
Mark Zuckerberg: మార్క్ జుకర్‌బర్గ్ స్ట్రాంగ్ వార్నింగ్.. పని చేయకపోతే కోతే!
ఆమె సోదరుడు అలీపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన దాని గురించి ఆంగ్లంలో అధికారికి తెలియజేశాడు. కువైట్ సిమ్ ఉన్న ఆమె మొబైల్ ఫోన్ ట్రాక్ కాకపోవడంతో, పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడం ప్రారంభించారు. “సీసీటీవీ ఫుటేజీలో ఆమె సూట్, క్యాప్, మాస్క్ ధరించిన వ్యక్తితో పసుపు రంగు టాక్సీలో ఎక్కినట్లు చూపించింది. కాబట్టి అతన్ని గుర్తించడం చాలా కష్టం. మేము టాక్సీ డ్రైవర్‌ను గుర్తించాము. వారు మార్క్విస్ స్ట్రీట్ (సెంట్రల్ కోల్‌కతాలో) సమీపంలో దిగినట్లు తెలుసుకున్నాము, ”అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అక్కడి నుంచి మరో టాక్సీలో బంగ్లాదేశ్ సరిహద్దుకు పొరుగున ఉన్న నార్త్ 24 పరగణాల జిల్లాలోని బంగాన్ సమీపంలోకి చేరుకున్నారు.
అనంతరం భారత భూభాగంలో వారు కనిపించలేదు. వందలాది సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన తర్వాత బంగ్లాదేశ్ జాతీయుడైన ఓ వ్యక్తి ఫొటో లభించినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. ఆ వ్యక్తిపై రెడ్ అలర్ట్ ప్రకటించారు. కోల్‌కతా పోలీసులు అలీపూర్ పోలీస్ స్టేషన్, యాంటీ రౌడీ సెక్షన్ సిబ్బందితో మాట్లాడగా.. వారు అంతర్జాతీయ సరిహద్దును దాటినట్లు స్పష్టంగా తెలియడంతో వారు న్యూఢిల్లీలోని కువైట్ ఎంబసీకి సమాచారం అందించారు. మహిళను రక్షించడంలో తమ అధికారుల పాత్రను ప్రశంసిస్తూ ఎంబసీ కోల్‌కతా పోలీసులకు ప్రశంసా పత్రాన్ని పంపిందని అధికారి తెలిపారు. ఆమె అందగత్తె కావడంతో ఆమెకు ఏమైనా జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కువైట్ పౌరురాలు లభించిన బంగ్లాదేశ్‌లోని లొకేషన్ గురించి మీడియాతో ఎలాంటి వివరాలు పంచుకోలేదు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!