Russia: బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నాయకుడి కుటుంబాన్ని కలవడానికి అమెరికా రాయబారి షాహీన్‌బాగ్‌ను సందర్శించడం బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకునే ప్రయత్నమని రష్యా పేర్కొంది. బంగ్లాదేశ్‌లోని రష్యా రాయబార కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది. అమెరికా రాయబారి దేశీయ అంతర్గత వ్యవహారాలను ప్రభావితం చేసేందుకు పట్టుదలతో ప్రయత్నిస్తున్నారని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖారోవా విలేఖరుల సమావేశంలో తెలిపారు.
అమెరికా రాయబారి బంగ్లా హక్కుల గురించి పట్టించుకునే సాకుతో అక్కడ దాక్కున్నారని జఖారోవా వెల్లడించారు. గతంలో డిసెంబర్ 14న అమెరికా రాయబారి పీటర్ హాస్ సుమారు దశాబ్దం క్రితం అదృశ్యమైన బీఎన్‌పీ నాయకుడు సజేదుల్ ఇస్లాం నివాసాన్ని సందర్శించారు. ఆయన నివాసం నుంచి బయటకు రాగానే కొందరు వ్యక్తులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆయన తన భద్రతా సిబ్బంది సాయంతో అక్కడి నుంచి సురక్షితంగా బయటపడగలిగారు. అనంతరం అమెరికా రాయబార్ పీటర్ బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్‌తో అత్యవసర సమావేశం నిర్వహించి తన పర్యటన వివరాలు ఎలా లీక్ అయ్యాయని ప్రశ్నించారు.
ఢాకాలోని యూఎస్ రాయబారి పీటర్ హాస్‌కు సంబంధించిన సంఘటనకు సంబంధించిన ఆందోళన గురించి బంగ్లాదేశ్ ప్రభుత్వ అత్యున్నత స్థాయికి అమెరికా తెలియజేసింది. ఈ విషయం వాషింగ్టన్‌లో కూడా చర్చనీయాంశమైంది. డిసెంబర్ 15న యూఎస్‌లోని బంగ్లాదేశ్ రాయబారి మొహమ్మద్ ఇమ్రాన్‌తో చర్చల సందర్భంగా, యూఎస్ సెంట్రల్, దక్షిణాసియా వ్యవహారాల సహాయ కార్యదర్శి డోనాల్డ్ లూ అమెరికా రాయబారి పీటర్ డీ హాస్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
Taiwan: చైనా నుంచి పొంచి ఉన్న ముప్పు.. తైవాన్ సంచలన నిర్ణయం
ఇదే సంఘటనను ప్రస్తావిస్తూ యూఎస్ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వెండి షెర్మాన్ గురువారంబంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి షహరియార్ ఆలమ్‌ను పిలిచి, ఎన్నికలు, భద్రత, యూఎస్ ఎంబసీ సిబ్బంది భద్రత గురించి చర్చించారు.”బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి షహరియార్ ఆలమ్‌తో చర్చ జరిగింది. యూఎస్-బంగ్లాదేశ్ సంబంధాలను బలోపేతం చేయడం, స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికల ప్రాముఖ్యత, యూఎస్ ఎంబసీ సిబ్బంది భద్రతపై చర్చించాం” అని షెర్మాన్ ట్వీట్ చేశారు. అంతకుముందు, డిసెంబర్ 19 న ఢాకాలో ఉన్న విదేశీ దౌత్యవేత్తల భద్రత విషయానికి వస్తే ఆందోళన చెందాల్సిన పని లేదని మోమెన్ అన్నారు. దౌత్యవేత్తలందరికీ పూర్తి రక్షణ కల్పిస్తామని బంగ్లా ప్రభుత్వం హామీ ఇస్తుందన్నారు.