Oxygen Plant Blast : బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చిట్టగాంగ్‌లోని సీతకుంట ఉపజిల్లాలోని ఆక్సిజన్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో భారీ ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి పేలుడులో ఆరుగురు చనిపోయినట్లు తేలింది. మృతుల సంఖ్య భారీగా ఉంటుందని అంచానా. ప్రమాదంలో 30 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
Read Also: Tunisha Sharma Death Case: తునీషా శర్మ హత్య కేసులో షీజాన్ కు బెయిల్
ఈ పేలుడు ఘటనలో ఘటనాస్థలికి రెండు చదరపు కిలోమీటర్ల దూరంలో ఉన్న భవనాలు కూడా కంపించాయి. పేలుడు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ పేలుడులో పలువురికి తీవ్రగాయాలు కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సరిగ్గా ఈ పేలుడుకు కారణం ఏమిటి? దీనికి కారణం ఇంకా తెలియరాలేదు.
Read Also: Sucide: బతకలేను..‘గుడ్ బై’.. కాల్చుకుని చనిపోయిన మాజీ హోం మంత్రి బంధువు
బంగ్లాదేశ్ ప్రభుత్వ అధికారి షాహదత్ హుస్సేన్ ప్రకారం.. ప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆక్సిజన్ ప్రాజెక్ట్ చుట్టూ భవనాలు ఉండటంతో ప్రజలు భయానక వాతావరణంలో ఉన్నారు.
Six killed in blast at oxygen plant in #Bangladesh
It was not immediately clear what caused the explosionhttps://t.co/5r9m5pEPgC
— Gulf News (@gulf_news) March 4, 2023