మీర్పూర్ వేదికగా… భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు ప్రారంభం అయ్యింది.. తొలి టెస్టులో భారీ విజయం సాధించిన టీమిండియా… రెండో టెస్టులోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. తొలి టెస్టులో టీమిండియా అన్ని రంగాల్లో సమష్టిగా రాణించింది. ఓపెనర్లు, మిడిలార్డర్‌తో పాటు టెయిలెండర్లు అద్భుతంగా రాణించారు. చతేశ్వర్ పూజారా, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ భారీ స్కోరుకి పునాదులు వేశారు. చివర్లో రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్…అసాధారణ బ్యాటింగ్ చేశారు. బ్యాటింగ్ ఒక్కటే కాదు.. బౌలింగ్‌లోనూ టీమిండియా పటిష్టంగా ఉంది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అశ్విన్, అక్షర్ పటేల్…బంగ్లా బ్యాటర్లను చుట్టేశారు. ఇక, రెండో టెస్ట్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. బ్యాటింగ్ ఎంచుకుంది..
Read Also: Severity of Cold: వణుకుతున్న తెలంగాణ.. పెరిగిన చలి తీవ్రత
మొదటి ఇన్నింగ్స్‌లో 150కే బంగ్లాను కూల్చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో…324 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటారు. ఇదే ఫామ్‌ను రెండో టెస్టులోనూ కొనసాగిస్తే.. టీమిండియా సిరీస్ క్లీన్ స్వీప్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. రోహిత్ శర్మ దూరం కావడంతో.. తొలి టెస్టుకు సారథ్యం వహించిన కేఎల్ రాహుల్.. రెండో టెస్టులోనూ టీమిండియాను నడిపించనున్నాడు. అద్భుత ఆటతీరుతో తొలి టెస్టులో 188 పరుగులతో గెలుపొందిన టీమిండియా.. సిరీస్‌లో 1-0 ఆధిక్యంతో ఉంది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి చేరుకుంది. ఈ టెస్టులోనూ గెలుపొందితే.. పాయింట్ల పట్టికలోనూ టీమిండియా ఎగబాకనుంది. ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకెళుతూ 120పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంటే టీమ్‌ఇండియా 87 పాయింట్లతో రెండులో ఉంది. ఇప్పటి వరకు భారత్ ఏడు విజయాలు, నాలుగు ఓటములు, రెండు డ్రాలు చేసుకుంది. ఇవాళ్టి నుంచి బంగ్లాదేశ్‌తో మొదలవుతున్న రెండో టెస్టులోనూ గెలిచి డబ్ల్యూటీసీ రేసులో మరింత ముందంజ వేయాలని టీమ్‌ఇండియా చూస్తున్నది. ఇక, తుది జట్టులో కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుబమ్‌గిల్, పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యార్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జాదవ్, ఉమేష్ యాదవ్, సిరాజ్‌కు చోటు దక్కింది.