MV Ganga Vilas: ప్రపంచంలోనే అతి పొడవైన నదీ యాత్రను ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దీనికి వారణాసి వేదిక కానుంది. ఎంవీ గంగా విలాస్ అనే నౌకను వీడియో లింక్ ద్వారా ప్రారంభించనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ గా గుర్తింపు పొందింది. షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర మంత్రులు ఈ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు.
Read Also: Pakistan: భారత ఛానెళ్లను ప్రసారం చేస్తున్న కేబుల్ ఆపరేటర్లపై పాక్ ప్రభుత్వం చర్యలు..
వారణాసి నుంచి బయలుదేరే ఈ నౌక బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోని దిబ్రూఘడ్ చేరుకుంటుంది. మొత్తం యాత్రకు 51 రోజలు సమయం పడుతుంది. 3200 కిలోమీటర్లు ప్రయాణించనుంది. వారణాసి మీదుగా పాట్నా, కోల్‌కతా, బంగ్లాదేశ్, గౌహతి, దిబ్రూగర్ వెంబడి నౌక పూ్రయాణిస్తుంది. మూడు అంతస్తులు ఉండే ఈ నౌక పొడవు 62 మీటర్లు, వెడల్పు 12 మీటర్లు ఉంటుంది. మొత్తం 27 నదీ వ్యవస్థల గుండా ప్రయాణం సాగనుంది. భారతదేశం, బంగ్లాదేశ్ కళలు, సంస్కృతి, చరిత్రను తెలుసుకునేందుకు విదేశీ పర్యాటకులకు ఈ నదీయాత్ర ఉపయోగపడనుంది. దేశంలో క్రయీజ్ పర్యటకానికి ఇది సహకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
నౌకా ప్రత్యేకతలివే..
ఉత్తర్ ప్రదేశ్ వారణాసి నుంచి బయలుదేరే ఈ ఎంవీ గంగా విలాస్ మొత్తం 3200 కిలోమీటర్లు ప్రయాణించి, బంగ్లాదేశ్ మీదుగా అస్సాం చేరుకుంటుంది. మూడు అంతస్తులు ఉండే ఈ నౌకలో మొత్తం 18 సూట్స్ ఉన్నాయి. తొలి యాత్ర కోసం న్యూజిలాండ్ కు చెందిన 32 మంది యాత్రీకులు నౌక మొత్తాన్ని బుక్ చేసుకున్నారు. ఒక్కొక్కరికి టికెట్ ధర రూ. 25,000. antara luxury river cruises సైట్ ద్వా రా టిక్కె ట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. జిమ్, స్పా వంటి సదుపాయాలతో పాటు అత్యాధునిక సౌకర్యాలు నౌకలో ఉన్నాయి. మొత్తం 27 నదుల ద్వారా ప్రయాణం సాగుతుంది. ప్రపంచ వారసత్వ కట్టడాలు, జాతీయ ఉద్యానవనాలు, నదుల ఒడ్డున ఉండే పట్టణాలు, పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలను సందర్శించవచ్చు. సుందర్భన్, బెంగాల్ డెల్టా ప్రాంతాలు, కజిరంగ నేషనల్ పార్క్ వంటి వాటిని సందర్శించే అవకాశం ఉంది. మొదటి రోజు వారణాసిలో గంగా హారతి తర్వాత నౌక బయలుదేరుతుంది. ఎనిమిది రోజుల్లో పాట్నాకు, 20వ రోజు కోల్ కతాకు, 35 రోజు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు, 50వ రోజు అస్సాం దిబ్రూగఢ్ కు చేరుకుంటుంది.