PM Modi: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ప్రధాని షేక్ హసీనా, ఆమె పార్టీ అవామీ లీగ్ చారిత్రాత్మక విజయం సాధించింది. ప్రతిపక్ష బీఎన్పీ పార్టీలో పాటు ఇతర పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో షేక్ హసీనాకు తిరుగు లేకుండా పోయింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో గెలిచి నాలుగోసారి ప్రధాని కాబోతున్నారు.
Bangladesh: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ప్రధాని షేక్ హసీనా విజయం సాధించారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో నాలుగోసారి హసీనా ప్రధాని పగ్గాలు చేపట్టబోతున్నారు. తిరిగి అధికారంలోకి వచ్చిన ఆమె ఎన్నికల విజయం తర్వాత మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్‌కి భారత్ గొప్ప స్నేహితుడు’’ అని ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడటమే కాకుండా, అనేక సమస్యలు పరిష్కరించుకున్నామని సోమవారం అన్నారు.
Shakib Al Hasan slaps Fan: ఇన్నాళ్లు మైదానంలో అదరగొట్టిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్.. ఇకనుంచి ప్రజాజీవితంలో కూడా భాగం కానున్నాడు. షకీబ్ ఎంపీగా కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఆదివారం జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మగుర 1 నియోజకవర్గం నుంచి పోటీ చేసిన షకీబ్.. భారీ మెజార్టీతో గెలుపొందాడు. అవామీ లీగ్ తరఫున పోటీ చేసిన బంగ్లా కెప్టెన్.. ఏకంగా లక్షా యాభై వేల మెజార్టీతో గెలిచాడు. షకీబ్ సమీప ప్రత్యర్థి ఖాజీ…
Bangladesh: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రతిపక్షాల ఎన్నికల బహిష్కరణ నడుము 40 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రస్తుతం అధికారులు కౌంటింగ్ ప్రారంభించారు. ప్రధాన మంత్రి షేక్ హసీనా వరసగా నాలుగోసారి అధికారంలోకి రావడం దాదాపుగా ఖాయమైంది. ప్రధాన ప్రతిపక్షమై బీఎన్పీ దాని మిత్రపక్షాలు పోలీటో పాల్గొనలేదు. ఆదివారం జరిగిన ఓటింగ్‌లో ఓటేసేందుకు చాలా తక్కువ మంది వచ్చారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.
Bangladesh Election Today: బంగ్లాదేశ్ జాతీయ అసెంబ్లీ పన్నెండవ ఎన్నికలకు ఆదివారం (07 జనవరి) ఓటింగ్ ప్రారంభమైంది. ప్రధానమంత్రి షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌తో సహా మొత్తం 27 పార్టీలు ఈ ఎన్నికల్లో పాల్గొన్నాయి,
Election Polling Starts in Bangladesh: బంగ్లాదేశ్‌లో 12వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దేశం అంతటా ఆదివారం ఉదయం 8 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. జనవరి 8 నుంచి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ప్రధాన ప్రతిపక్షం అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఈ ఎన్నికలను బహిష్కరించింది. బీఎన్పీకి ఇతర భావసారూప్యత పార్టీలు కూడా మద్దతుగా నిలిచాయి. అయినప్పటికీ బంగ్లాదేశ్‌లోని 300…
Bangladesh: బంగ్లాదేశ్‌లో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. నాలుగోసారి ప్రధానిగా షేక్ హసీనా అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీ ఎన్నికలను బహిష్కరిస్తుండటంతో షేక్ హసీనాకు తిరుగులేకుండా పోయింది. ఎన్నికలకు వ్యతిరేకంగా బీఎన్పీ హింసాకాండకు పాల్పడుతోంది. అక్రమ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్నికలను బహిష్కరిస్తూ, దేశవ్యాప్తంగా రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. శనివారం నుంచి ప్రారంభమయ్యే 48 గంటల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు బీఎన్పీ సిద్ధమైంది. దేశ రాజ్యాంగ ప్రక్రియకు అంతరాయం కలిగించొద్దని ప్రధాని షేక్…
Bangladesh : ఎన్నికలకు రెండు రోజుల ముందు బంగ్లాదేశ్‌లో హింస చెలరేగింది. ప్యాసింజర్ రైలుకు నిప్పు పెట్టారు దుండగులు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు సమాచారం.
Varun Gandhi: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తన నానమ్మ, దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై ప్రశంసలు కురిపించారు. 1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో భారత విజయాన్ని ప్రస్తావిస్తూ.. నిజమైన నాయకులు విజయానికి పూర్తి క్రెడిట్ తీసుకోరు అని అన్నారు. 1971 యుద్ధంలో చారిత్రాత్మక విజయం తర్వాత అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ సామ్ మానెక్షాకు ఇందిరాగాంధీ రాసిన లేఖను వరుణ్ గాంధీ పంచుకున్నారు.
Vijay Diwas: పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్(ఇప్పటి బంగ్లాదేశ్)కి విముక్తి కల్పించడం కోసం భారత్ 1971లో యుద్ధం చేయాల్సి వచ్చింది. తూర్పు పాకిస్తాన్లో ఏకంగా 90,000 మంది సైనికులు భారత్ ముందు లొంగిపోయారు. ఇందిరా గాంధీ ఉక్కు సంకల్పంతో బంగ్లాదేశ్ ఏర్పడింది. భారత్‌పై పాశ్చాత్యదేశాలు, అమెరికాలు ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా.. రష్యా భారత్‌కి అండగా నిలిచింది. 90 వేల మంది పాక్ సైనికులు భారత్ ముందు మోకరిల్లిన ఈరోజున భారత్ ‘విజయ్ దివాస్’ జరుపుకుంటుంది. యాభై రెండు…