T20 World Cup 2024: హెల్మెట్‌లో ఇరుక్కున్న బంతి.. చేత్తో పట్టుకుంటే ఔట్ ఇస్తారని ఏం చేశాడంటే?
- నెదర్లాండ్స్‌పై బంగ్లా విజయం
- హెల్మెట్‌లో బంతి
- చేతితో బంతిని తీస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ball gets stuck in Tanzid Hasan’s Helmet: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్ 8 రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. కింగ్స్‌టౌన్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. షకీబ్ అల్ హసన్ (64 నాటౌట్; 46 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకం బాదాడు. ఛేదనలో నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసిఓడింది. సిబ్రాండ్ (33; 22 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ఈ మ్యాచ్‌లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
Also Read: Niharika-Allu Arjun: అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేసిన మెగా హీరో.. నిహారిక సమాధానం ఇదే!
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
నెదర్లాండ్స్ బౌలర్ వివియన్ కింగ్మా వేసిన బౌన్సర్ బంగ్లా బ్యాటర్ తన్జీద్ హసన్ హెల్మెట్‌కు బలంగా తాకింది. అదృష్టవశాత్తు బంతి తన్జీద్ హెల్మెట్‌లో ఇరుక్కుపోవడంతో.. అతడికి ఎలాంటి గాయం కాలేదు. హెల్మెట్ నుంచి చేతితో బంతిని తీస్తే ప్రత్యర్థి జట్టు ఔట్ అని అపీల్ చేస్తుందో అని భయపడిన తన్జీద్.. హెల్మెట్‌ను తీసి నేలకు కొట్టాడు. అయినా కూడా బంతి బయటకు రాలేదు. బంగ్లా ప్లేయర్ వచ్చి బంతిని హెల్మెట్ నుంచి తీశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజావార్తలు
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!