ICC Punishes Tanzim Hasan: బంగ్లాదేశ్ పేసర్ తంజీమ్ సకీబ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ సకిబ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొరడా ఝుళిపించింది. మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడమే కాకూండా.. అతడి ఖాతాలో ఓ డీమెరిట్ చేర్చింది. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా కింగ్స్‌టౌన్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్‌తో గొడవకు దిగిన కారణంగా సకిబ్‌పై ఐసీసీ జరిమానా విధించింది.
మూడో ఓవర్ ముగిసిన అనంతరం నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ దగ్గరకు వెళ్లిన తంజీమ్ సకీబ్ ఢీకొట్టడమే కాకుండా.. కవ్వించే మాటలతో దురుసుగా ప్రవర్తించాడు. రోహిత్ డిఫెన్స్ షాట్లు ఆడుతుండటంతో సహనం కోల్పోయి అతడిపైకి దూసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తంజీమ్ దురుసు ప్రవర్తన పట్ల స్పందించిన ఐసీసీ.. క్రమశిక్షణ చర్యలకు దిగింది. ఐసీసీ ఆర్టికల్ 2.12 ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్నపుడు సహచర ఆటగాడు, అంపైర్, మ్యాచ్ రిఫరీ, సిబ్బంది, ప్రేక్షకుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే శిక్ష తప్పదు.
Also Read:
ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 21 పరుగుల తేడాతో గెలిచి సూపర్-8కు అర్హత సాధించింది.తంజీమ్ సకీబ్ (4/7) బంగ్లా విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండు ఓవర్లు మెయిడిన్ చేసి.. నాలుగు వికెట్లు పడగొట్టాడు. సూపర్-8 గ్రూప్-1లో భాగంగా జూన్ 21న ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్ తలపడనుంది. 22న భారత్, 24న ఆఫ్గనిస్తాన్ జట్లతో బంగ్లా తలపడాల్సి ఉంది. సూపర్-8లో రెండు మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే సెమీ ఫైన్సల్స్ చేరుతుంది.