టీ20 ప్రపంచకప్ -2024లో బంగ్లాదేశ్ సూపర్-8కి చేరుకుంది. సెయింట్ లూసియా వేదికగా ఇవాళ నేపాల్ తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్ సూపర్-8 బెర్త్ ఖారారు చేసుకుంది. తొలుత నేపాలీ బౌలర్లు బంగ్లాదేశ్ బ్యాటర్లను నియంత్రించడంలో విజయం సాధించారు. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు దాదాపు షాక్ ఇచ్చినంత పని చేసిన నేపాలీ బౌలర్లు.. ఈ మ్యాచ్‌లోనూ బంగ్లాను కట్టడి చేసేశారు. బంగ్లాదేశ్ కేవలం 106 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అయితే, స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన నేపాల్ బ్యాటర్లు చేతులెత్తేశారు.
Read Also: Tadepalli: వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీసు వద్ద ఆంక్షల తొలగింపు
బంగ్లా బౌలర్ల ధాటికి కేవలం 85 పరుగులకే కుప్పకూలిపోయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ, ముస్తాఫిజుర్ చెలరేగిపోయారు. తంజిమ్ హసన్ తన కెరీర్‌లోనే బెస్ట్ బౌలింగ్ వేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 4 వికెట్లు పడగొట్టాడు. అతను తన 4 ఓవర్లలో 21 డాట్ బాల్స్ వేశాడు. మరో బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ కూడా నేపాలీ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. 4 ఓవర్లలో ఏడు పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు.. నేపాల్ ఓ దశలో 26 రన్స్ కే 5 వికెట్లను కోల్పోయింది. బ్యాటర్ కుషాల్ మల్లా, దీపేంద్ర సింగ్‌లు 52 పరుగుల భాగస్వామ్యం జోడించారు. కుషాల్ 27, దీపేంద్ర 25 పరుగులు చేశారు.