టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో చివరి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ ముష్ఫికర్ రహీమ్ 'హ్యాండిల్డ్ ది బాల్' కారణంగా ఔట్ అయ్యాడు. దీంతో.. టెస్టు క్రికెట్లో ఈ విధంగా ఔటైన తొలి బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్గా నిలిచాడు. క్రికెట్లో అతి తక్కువగా కనిపించే ఘటనల్లో ఇదొకటి.
Earthquake: బంగ్లాదేశ్లో శనివారం ఉదయం 5.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. చిట్టగాంగ్లోని భూమి అంతర్భాగంలో 55 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
Shakib Al Hasan to contest in Bangladesh Elections 2024: బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ కొత్త కెరీర్ ప్రారంభించబోతున్నాడు. షకీబ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు. జనవరిలో జరిగే బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో షకీబ్ పోటీ చేయనున్నాడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న అవామీ లీగ్ తరఫున తన స్వస్థలమైన మగురా–1 నియోజకవర్గం నుంచి షకీబ్ పోటీ చేస్తున్నాడు. అవామీ లీగ్ నుంచి షకీబ్కు టికెట్ కూడా ఖరారైంది. జనవరి 7న బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. అవామీ…
2023 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. టీమిండియాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కోట్లాది మంది అభిమానులు.. ఇప్పటికీ ఆ బాధ నుంచి తేరుకోవడం లేదు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్లో భారత్ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్నారు అక్కడి జనాలు. అందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Shakib Al Hasan: 2024 జనవరిలో బంగ్లాదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు అక్కడి ఎన్నికల సంఘం ఇటీవల డేట్స్ వెల్లడించింది. అయితే ప్రస్తుతం అక్కడ నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా విపక్షాలు ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా అక్కడి విపక్షాలు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి.
Rohingya refugees: మయన్మార్లో హింసకు గురవుతున్న రోహింగ్యాలు బంగ్లాదేశ్, భారత్ వంటి దేశాలకు వెళ్తున్నారు. అయితే వీరి వల్ల బంగ్లాదేశ్లో క్రైమ్ రేట్ పెరుగుతోందని ఆ దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే ఇండోనేషియాకు వచ్చిన 250 మంది రోహింగ్యా శరణార్థులను స్థానికులు వెనక్కి తిప్పిపంపించారు. రోహింగ్యాలు ఒక చెక్క పడవలో ఇండోనేషియా దక్షిణ ప్రాంతంలోని అచే ప్రావిన్సు తీరానికి చేరుకున్నారు. అయితే కోపంతో ఉన్న స్థానికులు వారిని పడవ దిగొద్దని హెచ్చరించారు. కొంతమంది శరణార్థులు…
Cyclone Midhili: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది బంగ్లాదేశ్ తీరం వైపు ప్రయాణిస్తోంది. ఈ తుఫానుకు ‘మిధిలీ’ అని పెట్టారు. మిధిలీ తుఫాన్ బంగ్లాదేశ్ తీరం వైపు ప్రయాణించి నవంబర్ 17, అంటే ఈ రోజు రాత్రి సమయంలో బంగ్లాదేశ్ లోని ఖేపుపరా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం తుఫాన్ ఈశాన్య దిశగా కదులుతున్నట్లు వెల్లడించింది.
Cyclone Midhili: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరో 24 గంటల్లో తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. తుఫానుగా మారిన తర్వాత బంగ్లాదేశ్ లో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. బలమైన అల్పపీడనం ఉత్తర-ఈశాన్య దిశగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని, ఇది తుఫానుగా మారిన తర్వాత ‘మిధిలీ’గా పేరు పెట్టనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ పేరున మాల్దీవులు సూచించింది. మిధిలీ తుఫాన్ శనివారం ఉదయం బంగ్లాదేశ్ లోని ఖేపుపరా, మోంగ్లా…
Bangladesh: బంగ్లాదేశ్లో జనవరి 7న సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తామని ఆ దేశ ఎన్నికల సంఘం తెలిపింది. రిగ్గింగ్ అవుతుందనే భయంతో ఈ ఎన్నికలను బహిష్కరిస్తామని బెదిరించాయని ఆ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ బుధవారం తెలిపారు. బంగ్లాదేశ్ లోని 300 స్థానాలకు 12వ పార్లమెంటరీ ఎన్నికలు జనవరి 7న జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ హబీబుల్ అవల్ తెలిపారు. రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు పార్టీలు చర్చలు జరపాలని కోరారు.
వరల్డ్ కప్ 2023లో భాగంగా పూణే స్టేడియంలో ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో బంగ్లాని చిత్తు చేసింది. 307 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 44.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ బ్యాటర్ మిచెల్ మార్ష్ 177 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.