Delhi: అక్రమ బంగ్లాదేశీ వలసదారులపై ఢిల్లీ ఎల్జీ ఉక్కుపాదం..
- అక్రమ బంగ్లాదేశీ వలసదారులపై ఢిల్లీ ఉక్కుపాదం..
- చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎల్జీ ఆదేశం..
- వలసదారుల్ని వెళ్లగొట్టాలని ఇటీవల ఎల్జీని కోరిన ముస్లిం నేతలు..
- బంగ్లాదేశ్ హిందువుల అణిచివేత సమయంలో చర్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులపై కఠిన చర్యలు మొదలయ్యాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా దేశ రాజధానిలో అక్రమంగా చొరబడి బంగ్లాదేశీయులపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు. ఈ మేరకు ఎల్జీ ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నగర పోలీస్ చీఫ్‌కి లేఖ రాశారు. రాబోయే 60 రోజుల్లో అక్రమ వలసదారుల్ని గుర్తించి నిర్ణీత కాల వ్యవధిలో వారిని బహిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై అణిచివేత వేళ ఈ ఆదేశాలు వచ్చాయి. ఇటీవల దర్గా హజ్రల్ నిజాముద్దీన్, బస్తీ హజ్రల్ నిజాముద్దీన్‌కి చెందిన ముస్లిం కమ్యూనిటీల నాయకుల బృందం ఎల్జీ వీకే సక్సేనాని కలిశారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా, ఢిల్లీలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ జాతీయులపై చర్యలు తీసుకోవాలని వారంతా ఎల్జీని కోరారు. ఈ కోరిక మేరకు దేశరాజధానిలో బంగ్లాదేశీయులపై ఉక్కుపాదం మోపుతున్నారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
Read Also: AI Caught Thiefs: దొంగలను పట్టించిన ఏఐ.. 1.5 కిలోల బంగారం, 2 కిలోల వెండి, రూ. 17 లక్షల నగదు స్వాధీనం
అంతేకాకుండా..‘‘ అక్రమ బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఇళ్లు అద్దుకు ఇవ్వొద్దని, ఏ సంస్థలో ఉపాధి ఇవ్వకూడదని వారు డిమాండ్ చేశారు. వారి పిల్లలకు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ ఇవ్వకూడదని వారు డిమాండ్ చేశారు. అక్రమంగా సంపాదించిన ఆధార్, ఓటర్ ఐడీలను రద్దు చేయాలని కోరారు’’. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ఎల్జీ కఠినమైన చర్యలు తీసుకోవడానికి రెండు రోజుల పాటు ప్రత్యేకమైన డ్రైవ్ ప్రారంభించాలని కోరుకుంటున్నారు.
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ప్రభుత్వంలో హిందువులపై దాడులు తీవ్రమయ్యాయి. హిందువులు ఆస్తులు, వ్యాపారాలు, గుడులు, ఇళ్లు ఇలా అన్నింటిపై మతోన్మాద మూకలు దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా హక్కుల కోసం నినదించిన హిందూ నాయకులపై దేశద్రోహం కేసులు పెడుతోంది అక్కడి ప్రభుత్వం. హిందువులకు పెద్ద దిక్కుగా ఉన్న చిన్మోయ్ కృష్ణదాస్‌ని అరెస్ట్ చేసింది. ఇతడి అరెస్టుపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. మరోవైపు అక్కడి రాడికల్ ముస్లిం నేతలు ఇండియాని రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?