Bangladesh: బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ మహిళా జర్నలిస్టుపై అక్కడి మతోన్మాదుల మూక దాడికి ప్రయత్నించింది. ప్రముఖ టీవీ జర్నలిస్ట్ మున్సీ సాహా మీడియా కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా, ఢాకాలోని కార్వాన్ బజార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాహా ఒక భారతీయ ఏజెంట్ అని, మాజీ ప్రధాని షేక్ హసీనాకు మద్దతుదారు అని మూక ఆరోపించింది. చివరకు పోలీసులు కలుగజేసుకుని ఆమెని రక్షించాల్సి వచ్చింది. స్థానిక మీడియా నివేదిక ప్రకారం.. జర్నలిస్ట్ కారును గుంపు…
బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ నేత చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్ ఆ దేశంలో హిందువులు, మైనారిటీల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆయనని అరెస్ట్ చేయడం, బెయిల్ ఇవ్వకపోవడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న దాడుల్ని వెంటనే అరికట్టాలని బంగ్లాదేశ్‌ని కోరింది.
RSS On Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త మద్దతు కూడగట్టాలని, అందుకోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) పిలుపునిచ్చింది. అన్యాయంగా నిర్బంధించిన హిందూ సన్యాసి, ఇస్కాన్ మాజీ నేత చిన్మోయ్ కృష్ణదాస్‌ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, జరుగుతున్న హింసను ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే ఖండించారు.
Indian Flag - Bangladesh: బంగ్లాదేశ్‌లో గత కొంతకాలంగా భారత వ్యతిరేక వాయిస్ వినిపిస్తుంది. తాజాగా భారత జాతీయ జెండాను అవమానిస్తున్నట్లు ఉన్న ఒక ఫొటో సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది.
Temples Vandalized: బంగ్లాదేశ్‌లో చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుకు వ్యతిరేకంగా హిందువుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా, శుక్రవారం బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్‌లో మూడు హిందూ దేవాలయాలను నినాదాలు చేస్తూ దుండగుల గుంపు ధ్వంసం చేసింది. నగరంలోని హరీష్ చంద్ర మున్సెఫ్ లేన్‌లో శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు దాడి జరిగిందని, ఈ సందర్భంగా శాంతనేశ్వరి మాత్రి ఆలయం, శని మందిరం, శాంతనేశ్వరి కలిబారి ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. Also Read: Fire…
Bangladesh: బంగ్లాదేశ్‌లోని మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై రాడికల్ ఇస్లామిస్టులు దాడులకు తెగబడుతున్నారు. ప్రధానిగా షేక్ హసీనా దిగిపోయిన తర్వాత అక్కడ మతోన్మాదులు హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు. హిందువుల వ్యాపారాలు, గుడులు, ఇళ్లపై దాడులుకు తెగబడుతున్నారు. తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ పాలన ఈ అరాచకాలను అడ్డుకోలేకపోతోంది. హిందువుల హక్కుల గురించి నినదించిన ప్రముఖ హిందూ నేత, ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్‌ని అక్కడి ప్రభుత్వం దేశద్రోహం కేసు కింద అరెస్ట్ చేసింది. వరసగా హిందువుల్ని టార్గెట్ చేయడంపై…
బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితి నానాటికి దిగజారుతోంది. ఇటీవల హిందూ నాయకుడు చిన్మోయ్ కృష్ణదాస్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆ దేశ జాతీయ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కృష్ణదాస్‌కు బెయిల్ కూడా నిరాకరించారు. ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు ను వెంటనే విడుదల చేయాలని హిందూ సంఘాలు, ప్రజానికం నిరసనలు చేపట్టారు. వారిపై స్థానిక ముస్లింలు విచ్చలవిడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడులు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న ప్రధాని…
India On Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు, అణిచివేతపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. పొరుగు దేశంలో పెరుగుతున్న హింసాత్మక సంఘటనలపై బంగ్లాదేశ్‌కి తన తీవ్రమైన ఆందోళనని తెలిజేసింది.
Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ నాయకుడు, ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్ వివాదాస్పదంగా మారింది. దేశద్రోహం కింద ఆయనని బంగ్లా అధికారులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలపై భారత్ తన ఆందోళనను బంగ్లాదేశ్‌కి తెలియజేసింది. చిన్మోక్ కృష్ణదాస్‌కి మద్దతుగా కోర్టు వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనారిటీలపై అక్కడి అధికారులు తీవ్రంగా దాడి చేశారు. ఈ హింసాత్మక అల్లర్లలో ఒక న్యాయవాది కూడా మరణించారు.