Indian Coast Guard: భారతీయ సముద్ర జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్న రెండు బంగ్లాదేశ్ ఫిషింగ్ బోట్లను ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసీజీ) డిసెంబర్ 09న సీజ్ చేసింది. అక్రమంగా చేపట వేట సాగిస్తున్న 78 మంది మత్స్యకారుల్ని అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ(ఐఎంబీఎల్) వెంబడి సాధారణ పెట్రోలింగ్ సమయంలో ఈ ఆపరేషన్ జరిగింది.
Read Also: Mohan babu: మోహన్‌బాబు సమక్షంలో మీడియా ప్రతినిధులపై బౌన్సర్ల దాడి
భారత సముద్ర జలాల్లో అనుమానాస్పద కార్యకలాపాలను కోస్ట్ గార్డ్ గుర్తించింది. బంగ్లాదేశ్‌కి చెందిన ఎఫ్ఎం లైలా-2, ఎఫ్‌వీ మేఘన-5గా గుర్తించారు. తదుపరి విచారణ కోసం మత్స్యకారుల్ని, వారి నౌకల్ని పారాదీప్ పోర్టుకు తరలించింది. మత్స్యకారులు మరియు ఓడలపై భారతదేశం యొక్క మారిటైమ్ జోన్స్ చట్టం, 1981 కింద కేసు నమోదు చేయబడింది.