బంగ్లాదేశ్లో ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ కరెన్సీ నోట్ల నుంచి షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రం తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఢాకా ట్రిబ్యూన్ నివేదించింది.
Sheikh Hasina: మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా ప్రసంగాలు ప్రసారం కాకుండా బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ నిషేధం విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
Bangladesh: బంగ్లాదేశ్లో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని యూకే హెచ్చరించింది. తమ పౌరులు ఆ దేశానికి ప్రయాణించకుండా హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం యూకే ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ‘‘రద్దీగా ఉండే ప్రాంతాలు, మతపరమైన భవనాలు, రాజకీయ ర్యాలీలు వంటి వాటిలో పాటు విదేశీ పౌరులు సందర్శించే ప్రదేశాలతో సహా తీవ్రవాద దాడులు విచక్షణారహితంగా జరగవచ్చు’’ అని యూకే తెలిపింది.
Blind T20 World Cup Won Pakistan: అంధుల టీ20 ప్రపంచ కప్ టైటిల్ను పాకిస్తాన్ గెలుచుకుంది. ఫైనల్లో బంగ్లాదేశ్ను 10 వికెట్ల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. పాక్ జట్టు ఈ టైటిల్ గెలవడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులు చేయగలిగింది. టార్గెట్ ఛేదనలో పాకిస్థాన్ కేవలం 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుని మొదటిసారి అంధుల ప్రపంచకప్ను…
Bangladesh: బంగ్లాదేశ్లో పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. అక్కడి మైనారిటీలకు న్యాయం కూడా దొరకడం లేదు. బంగ్లాదేశ్లో ప్రముఖ హిందూ సన్యాసి, హిందువుల హక్కుల కోసం పోరాడుతున్న చిన్మోయ్ కృష్ణదాస్ని అక్కడి అధికారులు దేశద్రోహం కేసుపై అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే, అతడి తరుపున వాదించేందుకు ఏ లాయర్ కూడా ముందుకు రావడం లేదు.
Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులపై అఘాయిత్యాలు పెరిగాయి. హిందూ నేతల అరెస్టులు, హిందువుల ఆలయాలు, ఆస్తులు, వ్యాపారాలు, ఇళ్లపై మతోన్మాద మూక దాడులకు తెగబడుతోంది. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ అక్కడి అరాచకాలను కంట్రోల్ చేయలేకపోతున్నాడు.
Mamata Banerjee: బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువుల అణిచివేత జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రముఖ హిందూ నేతల్ని అక్కడి మహ్మద్ యూనస్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తోంది. రిజర్వేషన్ వ్యతిరేక అల్లర్ల కారణంగా షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి రావాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆ దేశవ్యాప్తంగా మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగాయి. గుడులు, హిందూ వ్యాపారాలు, ఇళ్లపై దాడులు చేస్తూనే ఉన్నారు.
Bangladesh: బంగ్లాదేశ్లో హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు. అక్కడి మహ్మద్ యూనస్ ప్రభుత్వం మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న అణిచివేతను పట్టించుకోవడం లేదు.
Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. బంగ్లాదేశ్లో మైనారిటీల పరిస్థితి, భారత్లోని మైనారిటీల పరిస్థితి ఒకేలా ఉందని, రెండు దేశాల మధ్య భేదం లేదని ఆమె అన్నారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) చీఫ్ ముఫ్తీ ప్రకటనను పలువురు బీజేపీ నేతలు ఖండించారు. ఆమె వ్యాఖ్యలు జాతి వ్యతిరేకమని చెప్పారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాన్ని కోరారు.
Bangladesh: స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన భారతీయ యువకుడికి బంగ్లాదేశ్లో చేదు అనుభవం ఎదురైంది. భారతదేశానికి చెందిన వ్యక్తి కావడంతో అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ బెంగాల్లోని బెల్ఘరియా నివాసి సయన్ ఘోష్ తన స్నేహితుడిని కలిసేందుకు నవంబర్ 23న ఢాకా వెళ్లాడు. అయితే, నవంబర్ 26న తిరిగి భారతదేశానికి వచ్చే సమయంలో ఆయన దాడికి గురయ్యాడు. 21 ఏళ్ల యువకుడు సయన్ ఘోష్ ఢాకాలోని బగన్బరీ ప్రాంతంలో తన స్నేహితుడితో కలిసి…