బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసిన విద్యార్థి సంఘాలను తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్ ప్రశంసలతో ముంచెత్తారు. ఎలాంటి సందేహం లేదు... విద్యార్థుల నేతృత్వంలోని విప్లవం కారణంగా హసీనా ప్రభుత్వం కుప్పకూలిందని ఆదివారం రాత్రి విద్యార్థులతో సమావేశం అనంతరం యూనస్ విలేకరులతో అన్నారు.
St Martin's Island: బంగ్లాదేశ్ అల్లర్ల వెనక అగ్రరాజ్యం కుట్ర ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా చెబుతోంది. బంగ్లాదేశ్ అల్లర్లు, తాను పదవి కోల్పోవడానికి అమెరికా కారణమని ఆమె ఆరోపనలు చేశారు.
ఇదిలా ఉంటే, తమను ఇండియాలోకి అనుమతించాలని పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ శరణార్థులు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) అధికారుల్ని వేడుకుంటున్నారు. అయితే, అధికారులు వారిని ఎందుకు అనుమతించలేరనే విషయాన్ని వివరిస్తున్నారు.
BJP: బంగ్లాదేశ్ అల్లర్లు, హింసను ఉద్దేశించి కొందరు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. భారత్‌లో కూడా ఇదే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు సల్మాన్ ఖుర్షీద్ ఇటీవల ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో, భారత్‌లో కూడా బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి రావచ్చని వ్యాఖ్యానించారు
Bangladesh : బంగ్లాదేశ్‌లో హింసాత్మక సంఘటనలు.. షేక్ హసీనాను గద్దెదించిన తర్వాత నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.
Sheikh Hasina: బంగ్లాదేశ్ హింస నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా భారత్ వచ్చేసింది. యూకేలో ఆమె ఆశ్రయం కోరిందని సమాచారం. అయితే, షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడంపై పలువురు బంగ్లాదేశ్ నేతలు మండిపడుతున్నారు.
Bangladesh: బంగ్లాదేశ్ రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకం మొదలైన అల్లర్లు దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలకు కారణమయ్యాయి. ఈ ఘటనల్లో 500 మందికి పైగా ప్రజలు మరణించారు. చివరకు షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియాకు పారిపోయి రావాల్సి వచ్చింది.
Bangladeshi Hindus: బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అక్కడ హింస కొనసాగుతోంది. ఆందోళనకారులు మైనారిటీ వర్గాలైన హిందువులను టార్గెట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ (భారత సరిహద్దులో ఉన్న బంగ్లాదేశ్ ప్రజలు) నుంచి చాలా హిందూ కుటుంబాలు తమ ఇళ్లను వదిలి భారతదేశానికి రావాలనుకుంటున్నారు.
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత పరిణామాలు భయాందోళనగా మారాయి. హిందువుల్ని లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు జరిగాయి. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చేశారు.