Sheikh Hasina: బంగ్లాదేశ్ హింస నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా భారత్ వచ్చేసింది. యూకేలో ఆమె ఆశ్రయం కోరిందని సమాచారం. అయితే, షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడంపై పలువురు బంగ్లాదేశ్ నేతలు మండిపడుతున్నారు. భారత్ ఒకే పార్టీతో సంబంధాలును కొనసాగించకూడదని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) చైర్‌పర్సన్ మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ అన్నారు. షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చే ముందు భారత్ ఆలోచించాలని ఆచన అన్నారు. బంగ్లాదేశ్‌కి భారత్ అతిపెద్ద పొరుగుదేశమని చెప్పారు.
‘‘ షేక్ హసీనాకు ఎవరూ ఎందుకు ఆశ్రయం ఇవ్వడం లేదు..? షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చేముందు భారత్ ఆలోచించాలి. ఇది ప్రజల మధ్య సంబంధాలను ప్రభావితం చేస్తుంది. అన్ని దేశాలు మనకు స్నేహంగా ఉండాలి’’ అని ఆయన అన్నారు. బంగ్లాదేశ్ హింసాకాండలో విదేశీ శక్తుల ప్రమేయం ఉందని భారత మీడియా కథనాలను ప్రచురిస్తోందిని బీఎన్‌పీ నాయకుడు అన్నారు. బంగ్లాదేశ్ అల్లర్లలో చైనా, పాకిస్తాన్ ఐఎస్ఐ పాత్ర ఉందని భారత మీడియా ఊహాగానాలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Kolkata: ట్రైనీ డాక్టర్ హత్య కేసులో నిందితుడికి 14 రోజుల పోలీస్ కస్టడీ
నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిందని, బీఎన్‌పీ నాయకులు భారత దౌత్యవేత్తలను కలిసినట్లు అలంగీర్ చెప్పారు. నిజానికి బీఎన్‌పీ చీఫ్ ఖలీదా జియా పాకిస్తాన్‌కి అనుకూలంగా వ్యవహరిస్తుంది. అయితే, హసీనా పాలనలో భారత్-బంగ్లా దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. హసీనాను ఫాసిస్ట్‌గా అభివర్ణించిన అలంగీర్, ఆమె అన్ని ప్రభుత్వ వ్యవస్థల్ని రాజకీయం చేశారని అన్నారు. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని అనుమతించాలని ఆయన అన్నారు.
బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న దాడులను ఆయన కొట్టిపారేశారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్న ఒక్క కేసు కూడా ఢాకాలో నమోదు కాలేదని చెప్పాడు. తన నియోజకవర్గంలో 35 శాతం మంది ఓటర్లు మైనారిటీలే అని అక్కడ ఎలాంటి దాడి జరగలేదని చెప్పారు. మాకు వ్యతిరేకంగా కొందరు స్వార్థపరులు పనిచేస్తున్నారని ఆరోపించారు. అన్ని పెట్టుబడులకు రక్షణ ఉంటుందని చెప్పారు. 2009లో అవామీ లీగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ప్రధాని, బీఎన్‌పీ చీఫ్ ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహమాన్ లండన్ పారిపోయాడు. ప్రస్తుతం అతను తిరిగి వస్తు్న్నట్లు చెప్పారు.