Banglasesh: బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలు ఆగడం లేదు. తాజాగా మరో హిందూ యువకుడిని అక్కడి మతన్మాదులు హత్య చేశారు. దీపు చంద్ర దాస్, అమృత్ మండల్ హత్యల తర్వాత ఇది మూడో ఘటన. ఒక వస్త్ర కర్మాగారంలో పనిచేసే 42 ఏళ్ల బజేంద్ర బిశ్వాస్‌ను నోమన్ మియాన్ అనే వ్యక్తి కాల్చి చంపినట్లు తెలుస్తోంది. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
Asaduddin Owaisi: బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై AIMIM పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీల రక్షణతో పాటు ప్రాంతీయ స్థిరత్వం ఎంతో కీలకమని పేర్కొన్నారు.
Suvendu Adhikari: బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువుల హత్యలు, దాడులపై పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత, ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఇజ్రాయిల్ గాజాలో చేసినట్లే, భారత్ కూడా బంగ్లాదేశ్‌కు గుణపాఠం నేర్పాలి’’ అని అన్నారు. శుక్రవారం రోజు బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
Bangladesh: బంగ్లాదేశ్ వ్యాప్తంగా మతోన్మాద శక్తులు రెచ్చిపోతున్నాయి. ఇప్పటికే, ఇద్దరు హిందువుల్ని అత్యంత దారుణంగా హత్యలు చేశారు. బంగ్లాదేశ్ కళాకారులు, సాంస్కృతిక చిహ్నాలపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా, ఢాకాకు 120 కి.మీ దూరంలో ఉన్న ఫరీద్‌పూర్‌లో బంగ్లా ఫేమస్ సింగర్ జేమ్స్ కచేరీపై దాడికి పాల్పడ్డారు.
Bangladesh Crisis: బంగ్లాదేశ్ సంక్షోభం సమయంలో, ఆ దేశ రాజధాని ఢాకాలో దుండగులు బాంబు దాడి చేశారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) బహిష్కృత నాయకుడు తారిఖ్ రెహమాన్ పర్యటనకు కొద్ది రోజుల ముందు, క్రిస్మస్ పండుగ ముందు రోజు ఢాకాలో తాజా హింస చెలరేగింది. బుధవారం సాయంత్రం రాజధానిలోని మొఘ్‌బజార్ కూడలి వద్ద బంగ్లాదేశ్ ముక్తిజోద్ధా సందస్ సెంట్రల్ కమాండ్ సమీపంలో శక్తివంతమైన నాటు బాంబు పేలుడులో ఒకరు మరణించారు.
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ సమావేశాల్లో నిప్పులు చెరిగారు. బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న హింసను లేవనెత్తారు. ప్రతిపక్షాలను విమర్శిస్తూ .. ‘‘బంగ్లాదేశ్‌లో ఒక దళిత యువకుడిని చంపారు. కానీ మీరు గాజా విషయంలో మాత్రమే కన్నీరు కారుస్తారు. మీరు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. ఎన్నికల కారణాల వల్ల ఈ విషయంపై ప్రతిపక్షాలు మౌనం వహించాయని ఆరోపించారు. Read Also: Shivaji Press Meet: నేను ఎవరితోనూ మిస్…
సమాజంలో జరిగే అన్యాయాలపై స్పందించడానికి చాలామంది స్టార్ హీరో హీరోయిన్లు వెనకాడుతుంటారు. కానీ తాజాగా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల చాలా ధైర్యంగా, ఎమోషనల్‌గా స్పందించారు నటి కాజల్. అక్కడ జరుగుతున్న దారుణాలను చూసి ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. Also Read : Shivaji-Chinmayi : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు.. గట్టి కౌంటర్ ఇచ్చిన చిన్మయి! బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్న…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. యువ రాజకీయ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య తర్వాత పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. షేక్ హసీనా కాలంలో జరిగిన ఉద్రిక్తతల కంటే ఎక్కువగా అల్లర్లు జరుగుతున్నాయి. హిందువులే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి.
Bangladesh: బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. అక్కడి రాడికల్ ఇస్లామిక్ శక్తులు ఆ దేశాన్ని కబ్జా చేయాలని చూస్తున్నాయి. ఇదే కాకుండా, అంతర్గత వర్గ పోరును కూడా భారత్‌కు ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ, రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్య. దీంట్లో భారత ప్రమేయం ఉందని చెబూతూ, అక్కడి మతోన్మాద మూక ఢాకాలోని భారత ఎంబసీపై దాడి చేసే యత్నం చేసింది. రాజకీయ, మత శక్తులు తమ…
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తి హత్య సంచలనంగా మారింది. రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత, ఇంక్విలాబ్ మంచా చీఫ్ షరీఫ్ ఉస్మాన్ హాదిని కాల్చిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా హింసాత్మక సంఘటనలు జరిగాయి. మైమన్సింగ్ జిల్లాలో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్‌ను ‘‘దైవ దూషణ’