St Martin’s Island: షేక్ హసీనాని గద్దె దించిన ‘‘ద్వీపం’’.. అమెరికాకి సెయింట్ మార్టిన్స్‌పై ఆసక్తి ఎందుకు..?
- షేక్ హసీనాను గద్దె దింపిన చిన్న ‘ద్వీపం’..
- సెయింట్ మార్టిన్ ఐలాండ్‌పై అమెరికాకు ఎందుకు ఆసక్తి..?
- కోపంతోనే హసీనాపై అమెరికా కుట్ర పన్నిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
St Martin’s Island: బంగ్లాదేశ్ అల్లర్ల వెనక అగ్రరాజ్యం కుట్ర ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా చెబుతోంది. బంగ్లాదేశ్ అల్లర్లు, తాను పదవి కోల్పోవడానికి అమెరికా కారణమని ఆమె ఆరోపనలు చేశారు. బంగ్లా వదిలి ఇండియాకు వెళ్లే ముందు దేశ ప్రజల్ని ఉద్దేశించి హసీనా మాట్లాడాలని అనుకున్నప్పటికీ, అక్కడి సైన్యం అందుకు అనుమతించలేదు. వీటన్నింటికి అమెరికాకు ‘సెయింట్ మార్టిన్స్’ ద్వీపాన్ని ఇవ్వకపోవడమే కారణమని ఆమె ఆరోపించినట్లు తెలుస్తోంది.
సెయింట్ మార్టిన్స్ ద్వీపం అమెరికా ఆసక్తి ఎందుకు..?
Also Read
బంగాళాఖాతంలో ఈశాన్య భాగంలో ఉన్న సెయింట్ మార్టిన్స్ ద్వీపం మయన్మార్‌కి దగ్గరగా ఉంది. బంగ్లాదేశ్ కాక్స్ బజార్-టెక్నాఫ్ కొనకు దక్షిణాన దాదాపు 9 కి.మీ దూరంలో ఈ చిన్న పగడపు దీవి ఉంది. ఇది ఆ దేశానికి చెందిన ఏకైక పగడపు దీవి. ఈ ద్వీపం మొత్తం 3 చ.కి.మీ వైశాల్యాన్ని కలిగి ఉంది. దాదాపుగా 3700 మంది నివాసితులు ఉన్నారు. ఇక్కడ నుంచి చేపల్ని, కొబ్బరి, వరిని మయన్మార్‌కి ఎగుమతి చేస్తుంటారు.
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) చీఫ్ ఖలీదా జియాకు ఎన్నికల్లో గెలిచేందుకు సాయం చేస్తే, ఈ ద్వీపాన్ని అమెరికా సైనిక స్థావరానికి విక్రయించాలని యోచిస్తున్నట్లు కథనాలు ఉన్నాయి. ఇది సైనికపరంగా వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. చైనా, భారత్, మయన్మార్ ఇలా పలు దేశాలకు దగ్గరగా ఉంది. అందుకు అమెరికా దీనిపై కన్నేసినట్లు తెలుస్తోంది. అయితే, అమెరికా ఒత్తిడికి లొంగకుండా ఈ దీవిని ఇవ్వనందుకే తనను గద్దె దింపారని షేక్ హసీనా ఆరోపిస్తోంది. ఈ దీవిని అమెరికాకి లీజుకు ఇచ్చి ఉంటే తాను అధికారంలో ఉండేదానినని చెప్పినట్లు సమచారం. అయితే, అమెరికా మాత్రం ఈ ఆరోపణల్ని ఖండిస్తోంది. చైనాను కౌంటర్ చేయడానికి అమెరికా కూడా ఈ ప్రాంతంలో తన బలాన్ని పెంచుకునేందుకు బంగాళా ఖాతంలోని సెయింట్ మార్టిన్స్ ద్వీపాన్ని కోరినట్లు నిపుణులు చెబుతున్నారు.
Read Also: Himachal Pradesh: శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం.. కారు వాగులో కొట్టుకుపోయి 11 మంది మృతి
ద్వీప చరిత్ర:
ఈ ద్వీపాన్ని బెంగాలీలో ‘ నారికేల్ జింజిరా’ లేదా కొబ్బరి ద్వీపం అని పిలుస్తారు. ఒకప్పుడు ఇది టెక్నాఫ్ ద్వీపకల్పంలో భాగంగా ఉండేది. కొంత భాగం మునిగిపోవడంతో ద్వీపంగా మారింది. 18వ శతాబ్ధంలో దీనికి అరేబియా వ్యాపారులు ‘జజీరా’ అనే పేరు పెట్టారు. 1900లో బ్రిటీష్ ల్యాండ్ సర్వే ఈ ద్వీపాన్ని బ్రిటిష్ ఇండియాలో భాగంగా చేశారు. దీనికి సెయింట్ మార్టిన్ అనే క్రైస్తవ మతగురువు పేరు పెట్టారు. 1937లో మయన్మార్ విడిపోయిన తర్వాత కూడా ఈ దీవి బ్రిటీష్ ఇండియాలో భాగంగానే ఉంది. 1947 దేశ విభజన తర్వాత పాకిస్తాన్ ఆధీనంలోకి వెళ్లింది. 971 విముక్తి యుద్ధం తర్వాత పగడపు ద్వీపం బంగ్లాదేశ్‌లో భాగమైంది. 1974లో ఈ ద్వీపం బంగ్లాదేశ్‌దే అని మయన్మార్‌తో ఒప్పందం జరిగింది.
ఈ ద్వీపం మయన్మార్‌కి సమీపంలో ఉండటంతో తరుచూ బంగ్లాదేశ్ జాలర్లని మయన్మార్ నిర్భందించడం వివాదంగా మారింది. ఈ ప్రాంతంలో సముద్ర జలాలపై ఆధిపత్యంపై ఇరు దేశాల మధ్య సమస్యలు ఉన్నాయి. 2012లో, ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ది సీ (ITLOS), ఒక మైలురాయి తీర్పులో, పగడపు ద్వీపంపై బంగ్లాదేశ్ సార్వభౌమాధికారాన్ని ధృవీకరించింది. దీంతో బంగ్లాదేశ్ ప్రాదేశిక జలాలు, స్పెషల్ ఎకనామిక్ జోన్(EEZ)పై అధికారం లభించింది.
తాజావార్తలు
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్‌ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!