Bangladesh: పాకిస్తాన్ వ్యాప్తంగా గత కొంత కాలంగా ‘‘గుర్తు తెలియని వ్యక్తులు’’ భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని హతమారుస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో చనిపోయారు. హఠాత్తుగా ఒకరు, ఇద్దరు బైక్‌పై వస్తారు, తమ లక్ష్యంగా ఉన్న ఉగ్రవాది దగ్గరకు వచ్చి, గుండెల్లో బుల్లెట్లు దించి, క్షణాల్లో అక్కడ నుంచి పరారవుతుంటారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్క ‘‘గుర్తు తెలియని వ్యక్తి’’ని పట్టుకోలేకపోయింది. కొన్ని సందర్భాల్లో ఈ దాడుల వెనక భారత గూఢచార సంస్థ ఉందని ఆరోపిస్తోంది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత, తొలిసారిగా సార్వత్రిక ఎన్నికలకు తేదీలు ఖరారయ్యాయి. బంగ్లా 13వ జాతీయ పార్లమెంటరీ ఎన్నికలను 2026, ఫిబ్రవరి 12 నిర్వహించనున్నట్లు ఆ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీరుద్దీన్ దేశ ప్రజల్ని ఉద్దేశిస్తూ ఈ ప్రకటన చేశారు.
Khaleda Zia: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) చీఫ్ ఖలీదా జియా(80) ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. ఆమె ఛాతీ ఇన్ఫెక్షన్ గుండె, ఊపిరితిత్తులకు వ్యాపించడంతో ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఆమె పరిస్థితి చాలా విషమంగా మారిందని ఆమె సన్నిహిత సహాయకుడు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు చెప్పినట్లు బీఎన్పీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం అలంగీర్ చెప్పినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. Read Also: Indus Valley…
Bangaldesh: గతేడాది బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఆందోళనల తర్వాత అప్పటి ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు పారిపోయి వచ్చింది. అయితే, ఈ హింసాత్మక ఉద్యమంలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు హసీనాపై బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) నేరాలను మోపింది. ఈ కేసులో నవంబర్ 13న తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో హై అలర్ట్ నెలకొంది. బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీర్పుకు ముందే ఉద్రిక్తతలు పెరిగాయి. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, కీలక ప్రదేశాల్లో సైన్యం, పోలీసులు…
Bangladesh: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చింది. హింసాత్మక విద్యార్థి ఉద్యమం తర్వాత మహ్మద్ యూనస్ బంగ్లా తాత్కాలిక పాలకుడిగా మారాడు. ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి మతోన్మాదుల చేతిలో పావుగా మారిపోయాడు. జమాతే ఇస్లామి వంటి సంస్థలతో అంటకాగుతూ, బంగ్లా వ్యాప్తంగా మతోన్మాదాన్ని పెంచిపోషిస్తున్నాడు. తాజాగా, మహ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో మ్యూజిక్, డ్యాన్స్, పీఈటీ టీచర్ల పోస్టుల్ని రద్దు చేశారు. Read Also: Speaker…
Khaleda Zia: భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా చాలా రోజుల మౌనం తర్వాత మొదటిసారి మాట్లాడారు. దేశంలో తన పార్టీ అధికారాన్ని కోల్పోడానికి అమెరికా, పాకిస్థాన్ కారణం అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. తాజాగా బంగ్లాదేశ్ రాజకీయాల్లోకి ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా ఎంట్రీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఆమె తిరిగి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. 2026 ఫిబ్రవరిలో…
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు మరణశిక్ష విధించాలని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం గురువారం ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్-1లో డిమాండ్ చేసింది. గతేడాది జూలై-ఆగస్టులో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సందర్భంగా 1,400 మంది మరణించారు. ఈ మరణాలను హత్యలుగా అభివర్ణించింది తాత్కాలిక ప్రభుత్వం.. హత్యలకు గాను హసీనాకు "1,400 మరణశిక్షలు" విధించాలని తాత్కాలిక ప్రభుత్వ న్యాయవాది ICT-1లో వాదించారు. గత ఏడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ నుంచి…
Muhammad Yunus: బంగ్లాదేశ్‌లో హింసాత్మక అల్లర్ల తర్వాత, గతేడాది ఆగస్టులో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చింది. ఆ తర్వాత మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఆయన మాట్లాడుతూ.. షేక్ హసీనా భారతదేశం నంచి తిరిగి బంగ్లాదేశ్‌కు వస్తే అవకాశం గురించి తాను ఆందోళన చెందుతున్నాని అన్నారు.
Muhammad Yunus: బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనుస్ భారత్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ దేశంలో హిందువులపై ఏమాత్రం హింస జరగడం లేదన్నారు. కానీ, భారత్ దీనికి భిన్నంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుందని ఆరోపించారు.
మాజీ ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి ఏడాది అయింది. ఆమె పార్టీ అవామీ లీగ్, స్టూడెంట్స్ లీగ్‌లను బంగ్లాలో నిషేధించారు. అయినప్పటికీ.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ మనస్సులో షేక్ హసీనా భయం తొలగిపోయినట్లు కనిపించడం లేదు. మొహమ్మద్ యూనస్ మరోసారి షేక్ హసీనా పార్టీపై ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు అవామీ లీగ్ దేశంలో గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు.