Home
Bangladesh Politics
Bangladesh Politics News
-
Bangladesh: బంగ్లా జాతీయ కవి పక్కనే రాడికల్ హాది అంత్యక్రియలు.. ఎందుకు ఇలా చేశారు?
Bangladesh: భారత వ్యతిరేకి, ఇస్లామిస్ట్ రాడికల్ విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్య బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలకు కారణమైంది. శనివారం అతడి అంత్యక్రియలు ఢాకాలో జరిగాయి. దీనికి లక్షలాది మంది హాజరయ్యారు. అయితే, బంగ్లా జాతీయ కవి, విప్లవ కవిగా పేరున్న కాజీ నజ్రుల్ ఇస్లాం సమాధి పక్కనే హాది అంత్యక్రియలు జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
India-Bangladesh: “భారత ఈశాన్య రాష్ట్రాలను వేరుచేస్తాం”.. బంగ్లా రాయబారికి సమన్లు జారీ..
India-Bangladesh: బంగ్లాదేశ్‌లో మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. ఢాకాలోని భారత హైకమిషన్‌కు భద్రతా బెదిరింపులు చేశారు. అయితే, ఈ పరిణామాలపై భారత్ బంగ్లాదేశ్ హైకమిషన్ ఎం రియాజ్ హమీదుల్లాకు సమన్లు జారీ చేసింది. ఢాకాలోని భారత మిషన్‌పై దాడులు చేస్తామంటూ అక్కడ కొంతమంది తీవ్రవాద శక్తులు వ్యాఖ్యానించడంపై భారత విదేశాంగశాఖ సమన్లు జారీ చేసినట్లు తెలిపింది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ సంఘటనలకు సంబంధించి సరైన ఆధారాలు పంచుకోకపోవడం, చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని చెప్పింది. యాదృచ్ఛికంగా, బంగ్లాదేశ్… -
Bangladesh: పాక్ మాదిరిగానే బంగ్లాదేశ్‌లో ‘‘గుర్తుతెలియని వ్యక్తులు’’.. భారత మ్యాప్‌ని కించపరిచినందుకు శిక్ష..
Bangladesh: పాకిస్తాన్ వ్యాప్తంగా గత కొంత కాలంగా ‘‘గుర్తు తెలియని వ్యక్తులు’’ భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని హతమారుస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో చనిపోయారు. హఠాత్తుగా ఒకరు, ఇద్దరు బైక్‌పై వస్తారు, తమ లక్ష్యంగా ఉన్న ఉగ్రవాది దగ్గరకు వచ్చి, గుండెల్లో బుల్లెట్లు దించి, క్షణాల్లో అక్కడ నుంచి పరారవుతుంటారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్క ‘‘గుర్తు తెలియని వ్యక్తి’’ని పట్టుకోలేకపోయింది. కొన్ని సందర్భాల్లో ఈ దాడుల వెనక భారత గూఢచార సంస్థ ఉందని ఆరోపిస్తోంది. -
Bangladesh: బంగ్లాదేశ్ ఎన్నికల డేట్ ఫిక్స్.. హసీనా పదవీచ్యుతి తర్వాత తొలి ఎలక్షన్స్..
Bangladesh: బంగ్లాదేశ్‌లో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత, తొలిసారిగా సార్వత్రిక ఎన్నికలకు తేదీలు ఖరారయ్యాయి. బంగ్లా 13వ జాతీయ పార్లమెంటరీ ఎన్నికలను 2026, ఫిబ్రవరి 12 నిర్వహించనున్నట్లు ఆ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీరుద్దీన్ దేశ ప్రజల్ని ఉద్దేశిస్తూ ఈ ప్రకటన చేశారు. -
Khaleda Zia: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని పరిస్థితి విషమం.
Khaleda Zia: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) చీఫ్ ఖలీదా జియా(80) ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. ఆమె ఛాతీ ఇన్ఫెక్షన్ గుండె, ఊపిరితిత్తులకు వ్యాపించడంతో ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఆమె పరిస్థితి చాలా విషమంగా మారిందని ఆమె సన్నిహిత సహాయకుడు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు చెప్పినట్లు బీఎన్పీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం అలంగీర్ చెప్పినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. Read Also: Indus Valley… -
Bangaldesh: బంగ్లాదేశ్‌లో హై అలర్ట్.. రేపు షేక్ హసీనా కేసులపై తీర్పు..
Bangaldesh: గతేడాది బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఆందోళనల తర్వాత అప్పటి ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు పారిపోయి వచ్చింది. అయితే, ఈ హింసాత్మక ఉద్యమంలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు హసీనాపై బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) నేరాలను మోపింది. ఈ కేసులో నవంబర్ 13న తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో హై అలర్ట్ నెలకొంది. బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీర్పుకు ముందే ఉద్రిక్తతలు పెరిగాయి. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, కీలక ప్రదేశాల్లో సైన్యం, పోలీసులు… -
Bangladesh: ఇస్లామిస్టులకు లొంగిపోయిన యూనస్.. పీఈటీ, మ్యూజిక్ టీచర్ పోస్టులు రద్దు..
Bangladesh: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చింది. హింసాత్మక విద్యార్థి ఉద్యమం తర్వాత మహ్మద్ యూనస్ బంగ్లా తాత్కాలిక పాలకుడిగా మారాడు. ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి మతోన్మాదుల చేతిలో పావుగా మారిపోయాడు. జమాతే ఇస్లామి వంటి సంస్థలతో అంటకాగుతూ, బంగ్లా వ్యాప్తంగా మతోన్మాదాన్ని పెంచిపోషిస్తున్నాడు. తాజాగా, మహ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో మ్యూజిక్, డ్యాన్స్, పీఈటీ టీచర్ల పోస్టుల్ని రద్దు చేశారు. Read Also: Speaker… -
Khaleda Zia: బంగ్లాదేశ్ ఎన్నికల్లోకి మాజీ ప్రధాని ఎంట్రీ.. ఎవరీ ఖలీదా జియా?
Khaleda Zia: భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా చాలా రోజుల మౌనం తర్వాత మొదటిసారి మాట్లాడారు. దేశంలో తన పార్టీ అధికారాన్ని కోల్పోడానికి అమెరికా, పాకిస్థాన్ కారణం అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. తాజాగా బంగ్లాదేశ్ రాజకీయాల్లోకి ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా ఎంట్రీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఆమె తిరిగి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. 2026 ఫిబ్రవరిలో… -
Bangladesh: “షేక్ హసీనాకు 1,400 సార్లు మరణశిక్ష విధించాలి..” బంగ్లా తాత్కాలిక సర్కార్ డిమాండ్..!
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు మరణశిక్ష విధించాలని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం గురువారం ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్-1లో డిమాండ్ చేసింది. గతేడాది జూలై-ఆగస్టులో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సందర్భంగా 1,400 మంది మరణించారు. ఈ మరణాలను హత్యలుగా అభివర్ణించింది తాత్కాలిక ప్రభుత్వం.. హత్యలకు గాను హసీనాకు "1,400 మరణశిక్షలు" విధించాలని తాత్కాలిక ప్రభుత్వ న్యాయవాది ICT-1లో వాదించారు. గత ఏడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ నుంచి… -
Muhammad Yunus: హసీనా బంగ్లాదేశ్‌కు వస్తుందని యూనస్‌లో ఆందోళన..
Muhammad Yunus: బంగ్లాదేశ్‌లో హింసాత్మక అల్లర్ల తర్వాత, గతేడాది ఆగస్టులో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చింది. ఆ తర్వాత మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఆయన మాట్లాడుతూ.. షేక్ హసీనా భారతదేశం నంచి తిరిగి బంగ్లాదేశ్‌కు వస్తే అవకాశం గురించి తాను ఆందోళన చెందుతున్నాని అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
-
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!