బీజేపీ అధికారం లోకి వస్తే.. గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక పాలసీ ఏర్పాటు చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత లిక్కర్ స్కాం తో దోచుకుందని ఆరోపించారు. కవిత జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు.
గుజరాత్ ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతం అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. అవినీతి ప్రభుత్వాన్ని ఓడించక తప్పదన్నారు. అభివృద్ధి చేసే వారే గెలుస్తారని బండి సంజయ్ అన్నారు.
బీజేపీ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్.. నిన్న బండి సంజయ్, ఎంపీ సోయం బాపురావు, రాథోడ్ రమేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించి ఆమె.. సీఎం కేసీఆర్, కవితపై నోరు జారితే నాలుక కోస్తాం జాగ్రత్త బండి సంజయ్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.. నాపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు.. దుబాయి గురించి మాట్లాడుతున్నావ్.. నేను 25 దేశాలకు వెళ్లాను.. స్వయంగా ప్రభుత్వమే నన్ను అమెరికాకు పంపించి.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న.. ఒళ్లు…