ప్రజా సంగ్రామ యాత్ర పేరిట తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. నేడు జగిత్యాలలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింది. అయితే.. ఈ సందర్భంగా బండి సంజయ్.. జగిత్యాల బస్ స్టాండ్ చౌరస్తాలో బిజెపి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో సమైక్యాంధ్ర నాయకులతో కుమ్మక్కై, కేసీఆర్ రాజకీయాలు చేస్తుండని ఆయన ఆరోపించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు ఇద్దరు కలిసి… కాంట్రాక్టులు చేస్తూ… కమిషన్లు దొబ్బుతూ… రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సెంటిమెంటు రగిలించి, రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ ప్రజలను కేసీఆర్ సర్వనాశనం చేసిండన్నారు. పుట్టబోయే బిడ్డ నెత్తి పైన లక్ష రూపాయల అప్పు పెట్టిండని, కరెంటు చార్జీలను పెంచిండన్నారు. ఈ జగిత్యాల జిల్లాలో పేదలకు ఇండ్లు కట్టడానికి పైసలు లేవంట కానీ, కేసీఆర్ బిడ్డ లక్ష కోట్లు పెట్టి ఢిల్లీ లక్కర్ దందా చేయడానికి మాత్రం పైసలు ఉన్నాయట అని ఆయన విమర్శించారు.
Also Read : Ramakrishna Math: బుక్ లవర్స్‌కు శుభవార్త.. పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్
అంతేకాకుండా.. ‘ఈ ఎనిమిదేళ్లలో పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కుటుంబాన్నీ, కెసిఆర్ ఆదుకోలేదు. ధాన్యం కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఇష్టపడడం లేదు. ధాన్యం సేకరణకు నిధులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. ధాన్యం సేకరణలో కేసీఆర్ చేస్తున్నది కేవలం బ్రోకరిజమే. కేసీఆర్ చేస్తున్న బ్రోకరిజానికి డబ్బులు ఇస్తున్నది మోడీనే. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత, మనం ఏం సాధించుకున్నాం?. తెలంగాణ రాష్ట్రానికి ముందు… వచ్చిన తర్వాత.. రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కుటుంబ పోషణ కోసం టెన్త్ క్లాస్ చదివే పిల్లోడు కూడా… దుబాయ్ కి వలస పోతున్న పరిస్థితి. ఈ జగిత్యాల నుంచే రోజు 5 బస్సులు ముంబైకి వలస పోతున్నాయి. గల్ఫ్ కార్మికుల ఇబ్బందులను మాటల్లో వర్ణించలేను. ఇప్పటికీ విదేశాల్లో వేల మంది వలస కార్మికులు జైళ్లలో మగ్గుతున్నారు. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు 500 కోట్ల రూపాయలతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తానన్నాడు కేసీఆర్. మరి ఏర్పాటు చేశాడా?. నేటికీ గల్ఫ్ కార్మికులు బిచ్చమెత్తుకునే పరిస్థితి తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే…ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిలువ నీడలేని వాళ్లకు ఇండ్లను కట్టించి ఇస్తామని హామీ ఇచ్చాం. తెలంగాణకు మోదీ మంజూరు చేసిన ఇండ్లను కూడా… కేసీఆర్ కట్టించడం లేదు.
ఈ ఎనిమిదేళ్లలో పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కుటుంబాన్నీ కేసీఆర్ ఆదుకోలేదు. బీజేపీ వస్తే… ‘ఫసల్ బీమా యోజన’ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి, రైతులను ఆదుకుంటాం. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే… మతతత్వం రెచ్చగొట్టినట్టా?. సంఘవిద్రోహ శక్తులకు జగిత్యాల అడ్డాగా మారింది. PFI లుచ్చాగాళ్ళు హిందువులను చంపుతున్నారు. పాకిస్తాన్ జిందాబాద్ అన్నవాళ్లను బట్టలు ఊడదీసి కొడతాం. PFI లుచ్చాగాళ్ళు ఇక్కడ ర్యాలీలు తీస్తుంటే… మీరేం చేస్తున్నారు?. PFI అనే ఒక దుర్మార్గపు సంస్థకు, నిషేధిత సంస్థకు ఫండింగ్ చేస్తున్నది కేసీఆర్ పార్టీ నే. “పోలీసులకు బండి సంజయ్ విజ్ఞప్తి…”
Also Read : Shocking Survey : కాపురాలు కటకట.. చిచ్చుపెడుతున్న సెల్‌ఫోన్..
PFI లుచ్చాగాళ్లను కాల్చిపారేయండి. రేపు మీ పిల్లలు మిమ్మల్ని చూసి, గర్వించేలా చేయండి. ఢిల్లీ నుంచి NIA(NATIONAL INVESTIGATION AGENCY) వచ్చి, ఇక్కడ PFI వాళ్ళను అరెస్ట్ చేసే వరకు… ఇక్కడి ఇంటెలిజెన్స్ కు తెలీదా?. కేసీఆర్ పాలనలోని రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది?. 15 నిమిషాల్లో హిందువుల తలలను నరికి చంపుతానన్నా లుచ్చా నా కొడుకు గాడు… ఏం మాట్లాడినా ఊరుకుందామా?. బరాబర్ నా ధర్మాన్ని నేను కాపాడుతా… పోరాడుతా. హిందూయేతర పండుగలకు అనుమతి ఇచ్చే కేసీఆర్ ప్రభుత్వం… హిందువుల పండగలు జరుపుకోవాలంటే అనుమతుల పేరుతో ఇబ్బంది పెడుతోంది. సౌదీ, మక్కాకు వెళ్ళేవారికి. తెలంగాణ ప్రభుత్వం రాయితీ కల్పిస్తోంది. ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న పేద అయ్యప్ప స్వాములకు పూజ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వరా…? వెసులుబాటు కల్పించరా…?. అయ్యప్ప దీక్ష , హనుమాన్ దీక్ష, భవాని దీక్ష వేసుకునే స్వాములకు వెసులుబాటు కల్పించాల్సిందే. బీజేపీ అధికారంలోకి వస్తే…నిరుపేద అయ్యప్ప భక్తులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తాం. అల్లాని, ఏసుప్రభు ను ఎప్పుడూ నేను కించపరచలేదు.
‘లవ్ జిహాద్’ పేరుతో… హిందూ అమ్మాయిలను 30 ముక్కలు చేసి, నరికి చంపుతున్నారు. అయినా ఏ ఒక్కరూ మాట్లాడలేదు. కనీసం ప్రజా సంఘాలు కూడా మాట్లాడలేదు. జిహాదీ ఉగ్రవాదులు కేరళలో 30 వేల మంది క్రైస్తవ అమ్మాయిలను మతమార్పిడి చేసి, విదేశాలకు అమ్మేశారు. హిందువులు హిందువు అని చెప్పుకుంటే… మతతత్వవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు. కేసీఆర్ ఢిల్లీకి పోయిండు. ఇక అటే పోతాడు. ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పేరు నుంచి ‘తెలంగాణ’ పదాన్ని తీసి పడేసిండు.
తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద ఓట్లు వేసి, గెలిపించిన ప్రజలను… తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ మోసం చేసిండు. బీఆర్ఎస్ అంటే లండన్ లో ఒక జిన్(మందు) పేరు. తెలంగాణ తల్లికి ద్రోహం చేసిండు. దొంగ దందాలు చేయడానికి… తెలంగాణ తల్లిని, తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తుండు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు నా చిన్నమ్మ ‘సుష్మా స్వరాజ్’ సపోర్ట్ చేయకపోతే… నేడు తెలంగాణ వచ్చేదేనా?. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ వేలకోట్ల రూపాయల నిధులు ఇస్తుంటే…. కేసీఆర్ సహకరించడం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న మూర్ఖుడు కేసీఆర్’ అని ఆయన ధ్వజమెత్తారు.