తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాజకీయ వేడి మామూలుగా ఉండదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా సెస్ ఎన్నికలు రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికలే కాదు ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన సెస్ ఎన్నికల్లో కూడా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది.
అటల్ స్పూర్తితో మోడీ పాలన సాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. భరతమాత ముద్దుబిడ్డ, మృదుస్వభావి, స్థితప్రజ్ఞత కల్గిన ఋషి , దేశం కోసమే జీవించిన తాపసి, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారి వాజ్ పేయి జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి బండి సంజయ్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు.
తెలంగాణలో అధికార బీఆర్ఎస్, విపక్ష బీజేపీ మధ్య.. మాటల యుద్ధంతో పాటు సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది.. తాజాగా చెప్పుతో కొట్టుకునే వ్యాఖ్యలు రచ్చ చేస్తున్నాయి.. ఇప్పుడు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి బహిరంగ సవాల్ విసిరారు.. మా ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన ఆయన కుటుంబ సభ్యులపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు.. ఈ రాష్ట్రంలో జరిగినట్లుగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు చూపించిన నేను రాజీనామా చేస్తాను…
Bandi Sanjay criticizes Minister KTR: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం మంత్రి కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా ఉంది. ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్, కేటీఆర్ పై విమర్శలు చేశారు. కేటీఆర్ విత్ డ్రావల్ సిమ్టమ్స్ తో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే పిచ్చిపిచ్చిగా వాగుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన…
చెప్పుతో కొడితే కొట్టించుకుంటా.. తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికలు,పార్టీ సంస్థాగత బలోపేతం కోసం పార్టీ కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు.
డ్రగ్ పరీక్షకు ఏ శాంపిల్ కావాలన్నా ఇస్తా.. మోడీని ఇమ్మంటా… మరొకరిని ఇమ్మంటా .. ఇస్తారా? అంటూ మంత్రి కేటీఆర్ మంగళవారం బండి సంజయ్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. దొంగలు బడ్డ ఆరునెలలకు ఇప్పుడు మొరగడం ఎందుకు అంటూ మండిపడ్డారు.