జగిత్యాల జిల్లా ప్రజా సంగ్రామ యాత్రలో మీడియాతో బండి సంజయ్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెంగుళూరు డ్రగ్స్ కేసులో కొందరు అధికారులు హైదరాబాద్ అధికారులతో ములాఖత్ అయ్యారని, బీజేపీ రెండు సార్లు లీగల్ టీమ్ వెళ్లి సమాచారం రాబడుతుందన్నారు. దీంతో హడావుడిగా ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్ రెడ్డిని తీసుకెళ్లి హడావుడిగా స్టేట్ మేంట్ రికార్డ్ చేయించారన్నారు బండి సంజయ్. బెంగుళూరు డ్రగ్స్ కేసు ఇష్యూ తిరిగి రిఓపెన్ చేస్తే చాలా బయటపడతాయని ఆయన వెల్లడించారు.
Also Read : Cervical Cancer Vaccine: గుడ్ న్యూస్.. 4 నెలల్లో అందుబాటులోకి గర్భాశయ క్యాన్సర్ నిరోధక వ్యాక్సిన్
ఎమ్మెల్యేల పాత్ర ఏమి ఉంది దీని వెనుక ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరున్నారో విచారణ చేయాలని కోరుతామన్నారు. బెంగుళూరు డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఉన్నాడని, డ్రగ్స్ కేసులో కర్ణాటక పోలీసులు నుండి రోహిత్ రెడ్డికి నోటీసులు వచ్చాయన్నారు. రోహిత్ రెడ్డికి బీజేపి లీగల్ టీమ్ సమాచారం తెలుసుకుంటుంది తెలియదని, డ్రగ్స్ కేసులో లీగల్ టీమ్ ఎంక్వయిరి విషయం ఇక్కడి అధికారులుకు లీక్ అయిందన్నారు. హడావుడిగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో స్టేట్ మెంట్ రికార్డ్ చేశారన్నారు. డ్రగ్స్ కేసు బయటకు వస్తే ఎమ్మెల్యే మాట వినడని వాస్తవాలు బయట పెడతాడని సీఎం భయపడిండు అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Harish Rao : మన మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా పని చేద్దాం