రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి ఫ్లెక్సీల కలకం రేపాయి. టీఆర్ఎస్ యూత్ నాయకులు బండి సంజయ్ ఫోటోతో పెట్టిన ఫ్లెక్సీలు చర్చకు దారితీశాయి. సిరిసిల్లలోని పలు కూడళ్లలో బండి సంజయ్ పై వ్యంగ్యాస్త్రాలుతో ఫ్లెక్సీలు పెట్టడంతో బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 5వ రోజు పాదయాత్రతో రాష్ట్రంలో రాజకీయ వేడి పెరిగింది. అధికార టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తూ ఈ రెండు పార్టీలు దూకుడు పెంచాయి. వైఎస్ ఆర్టీపీ షర్మిల పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న హైడ్రామా కొనసాగింది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజసంగ్రామ యాత్ర నేడు ఇవాళ ఉదయం తాడేపల్లి నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. నేడు గుండెగావ్, మహాగావ్ మీదుగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.
Bandi Sanjay criticizes CM KCR: సీఎం కేసీఆర్ కు మూడింది.. వచ్చేదీ బీజేపీ సర్కారే అని అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఐదో విడత ప్రజసంగ్రామ యాత్రలో భాగంగా బైంసాలో జరిగిన బహిరంగ సభలో బండి సంజయ్ టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి రాగానే బైంసా పేరును ‘మహిషా’గా మారుస్తామని అన్నారు. బైంసాను దత్తత తీసుకుంటామని.. బైంసా అల్లర్ల బాధితులపై కేసులు ఎత్తేస్తాం అని వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీలు…
మా పాదయాత్రతో సీఎం కేసీఆర్ వెన్నులో వణుకు స్టార్ట్ అయ్యిందని వ్యాఖ్యానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. నిర్మల్ జిల్లా అడెల్లి పోచమ్మను దర్శించుకున్న ఆయన.. 5వ విడత పాదయాత్రను ప్రారంభించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి.. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, ప్రజల కష్టాలను గాలికి వదిలేసి, ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారని ఆరోపించారు.. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు, ప్రజలకు భరోసా కల్పించేందుకే పాదయాత్ర చేస్తున్నానని.. ఇప్పటివరకు నాలుగు విడతలుగా…
బండి సంజయ్ ఐదో విడుత ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా పడిందని కరీంనగర్ ఎంపీ బీజేపీ ప్రజా సంగ్రామ పాదయాత్ర ఇన్ చార్జి మనోహర్ రెడ్డి తెలిపారు. బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభ సభ రేపు ఉంటుందని స్పష్టం చేశారు.
బీజేపీది పాద యాత్ర కాదు కుట్రల యాత్ర అని చీఫ్ విప్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ జిల్లా క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై ఫైర్ అయ్యారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై సందిగ్ధత నెలకొంది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు పాదయాత్ర మొదలవుతుందా..? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది. లా అండ్ ఆర్డర్ కారణాల వల్ల చివరి నిమిషంలో పోలీసులు మార్చ్‌కు అనుమతి నిరాకరించారు. పోలీసుల నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ ఈరోజు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది.