Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసులో తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆయన కొడుకు కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీ కార్యాలయంలో ఉగాది పర్వదిన వేడులకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. హిందూ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలని కోరారు. ఆయురారోగ్యాలతో కుటుంబాలతో పండుగ జరుపుకోవాలని అన్నారు. అయితే సిట్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ఇంటికి నోటీసులు అంటించారనే వార్తలపై ఆయన స్పందించారు. తనకు సిట్ నోటీసులు అందలేదని సంచలన వ్యాఖలు చేశారు. సిట్ నోటీసులు అంటించిన ఇల్లు ఎవరిదో తనకు తెలియదన్నారు. ఏ ఇంటికి నోటీస్ లు అంటించారో నాకు తెలియదని సమాధానం ఇచ్చారు. దొంగలు వేశారో ఏమో.. నేను పోయే సరికి ఏదో కాగితం చినిగి పోయి ఉందని, అసలు సిట్ నోటీస్ లు నాకు అందలేదన్నారు. మాకు విప్ జారీ చేశారని, 23,24 తేదీల్లో పార్లమెంట్ కు హాజరు కావాలని విప్ ఉందని తెలిపారు.
Read also: TDP Ugadi Panchangam: దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు
సిట్ అంటే సీఎం సిట్ అంటే సిట్… స్టాండ్ అంటే స్టాండ్ అంటూ ఎద్దేవ చేశారు. అనేక సందర్భాల్లో సిట్ వేశారు.. ఒక సిట్ రిపోర్ట్ ను అయిన బయట పెట్టారా? అంటూ ప్రశ్నించారు. నోటీస్ లు సీఎంకు, సీఎం కొడుక్కు ఇవ్వాలని మండిపడ్డారు. వారు ఏమన్నా చట్టానికి అతీతులా? అంటూ ప్రశ్నించారు. మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడారు వారికి ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కానీ రేవంత్ రెడ్డి కానీ మాకు ప్రజల నుండి వచ్చిన సమాచారం మాట్లాడుతామని బండి సంజయ్ వ్యాఖ్యానించడం చర్చకు దారితీసింది. మాట్లాడితే నోరు మూస్తం అనే చెప్పేందుకు నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరిస్తే భయ పడము అన్నారు. పేపర్ లీకేజీ సర్వసాధారణమని ఓ కబ్జాల మంత్రి అంటున్నారని ఆగ్రహం వ్యక్తి చేశారు. BRS పార్టీ నిద్రావస్థలో ఉందని, సీఎం కేసీఆర్ కు మూడిందని కీలక వ్యాఖ్యలు చేశారు. అటుకులు బుక్కి కెసిఆర్ బతుకుతున్నారని, కవిత ఢిల్లీలో విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి డబ్బులు ఎలా వచ్చాయని? ప్రశ్నించారు.
Read also:Viral : తండ్రి కోరిక నెరవేర్చిన కొడుకు.. మృతదేహం ఎదురుగా లవర్ తో పెళ్లి
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేశారు. ఆ ఆధారాలను తనకు సమర్పించాలని బండి సంజయ్‌ను నోటీసుల్లో కోరారు. మార్చి 24న తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. సంజయ్ ఇంట్లో లేరని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం వాచ్‌మెన్‌కు చెప్పి.. ఇంటి గోడకు నోటీసులు అంటించారు. ఇదే అంశంపై రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరై తన వద్ద ఉన్న ఆధారాలను చూపించాలని నోటీసుల్లో పేర్కొంది.
Earthquake: మార్చి నెలలో 6 భూకంపాలు.. ఉత్తరాదిని వణికిస్తున్న ప్రకంపనలు..