Ponnam Prabhakar: సిరిసిల్లకి మీరేం చేశారో చెప్పండి? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపి వినోద్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణలో కూడ 70 శాతం పవర్ లూమ్స్ సిరిసిల్ల లో ఉన్నాయని తెలిపారు. సిరిసిల్ల పరిశ్రమ సమస్య మాత్రం పరిష్కారం కాలేదని మండిపడ్డారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం 9 మెగా క్లష్టర్లు మంజూరు చేస్తే తెలంగాణకి ఒకటి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది సిరిసిల్లలో నెలకొల్పే బాధ్యత బీజేపీ బండి సంజయ్ చొరవ తీసుకోవాలని, కేంద్రం లో బీజేపీ ఉందని తెలిపారు.
Read also: West Bengal : అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో బ్లాస్టింగ్.. ముగ్గురు మృతి
టెక్స్ట్ టైల్ ఇండస్ట్రీ, కార్మికుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ తరుపున పోరాటం చేస్తామన్నారు. సిరిసిల్ల టెక్స్ట్ టైల్ పట్ల వివక్ష కొనసాగుతుందని ఆరోపించారు. బీజేపి ఎంపి బండి సంజయ్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బండి సంజయ్, ఎంపి వినోద్ కుమార్ మీకు సవాల్ చేస్తున్న సిరిసిల్ల కి మీరు ఎం చేశారో చెప్పాలని అన్నారు. వెల్ఫేర్ నుండి కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని కోరారు. కేంద్రం ప్రభుత్వం విడుదల చేసిన ప్రిసైడింగ్ బండి సంజయ్ కి పంపిస్తున్నానని అన్నారు. వరంగల్ లో ఇది వరకే కాకతీయ మెగా టెక్స్ట్ టైల్ ఉందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం పేరు పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రీయ విశ్వ విద్యాలయంకి కనీసం స్థలం చూపించడం లేదని నిప్పులు చెరిగారు. కేంద్రం ఇస్తున్న మెగా టెక్స్ట్ టైల్ ఇండస్ట్రీ సిరిసిల్ల కి చెందాలని, ప్రభుత్వం చొరవ చూపాలని, ఎంపి బండి సంజయ్ బాధ్యత వహించాలని ఆయన కోరారు.
TSPSC: TSPSC పేపర్ లీకేజ్ కేసుపై 4వ రోజు విచారణ.. యూజర్ ఐడి, పాస్ వర్డ్ పై..