పదో తరగతి ప్రశ్నా ప్రతాల లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ కి నిన్న హనుమకొండ కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. అయితే.. ఈ నేపథ్యంలో బండి సంజయ్ తరుఫున లాయర్లు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేయగా కోర్టు విచారణ చేపట్టింది. ఇదే సమయంలో బండి సంజయ్‌కు బెయిల్ ఇవ్వద్దని.. కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. దీంతో.. రెండు పిటిషన్లపై హనుమకొండ ఫస్ట్ క్లాస్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అనిత రాపోలు విచారణ చేపట్టారు. అయితే.. మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రారంభమైన విచారణ 8 గంటల పాటు ఉత్కంఠగా సాగింది. బండి సంజయ్‌కు ఈ పేపర్ లీకేజీతో సంబంధం లేదని ఆయన తరుఫు లాయర్లు వాదనలు ఒకవైపు ఉండగా.. బండి సంజయ్‌కు బెయిల్ ఇస్తే.. ఆధారాలు తారుమారు చేస్తారని, ఇంకా ఆయనను విచారించాల్సింది ఉందంటూ.. పోలీసులు మరోవైపు వాదనలు వినిపించారు. దీంతో బండి సంజయ్ బెయిల్‌పై నిర్ణయాన్ని మూడుసార్లు వాయిదా వేసిన మెజిస్ట్రేట్… చివరకు ఉత్కంఠ పరిస్థితుల మధ్య షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. బండి సంజయ్ బెయిల్ పిటీషన్ తీర్పు పైనా ఉత్కంఠగా పెరగడంతో కోర్టు ప్రాంగణానికి వరంగల్ జిల్లా బీజేపీ ముఖ్య నాయకులు చేరుకున్నారు.
Also Read : Tips for Cholesterol : చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే ఆరు సూపర్ ఫుడ్స్
అయితే.. పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధాన కుట్రదారు అని పోలీసులు అభియోగం మోపారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని కమలాపూర్‌లో జడ్పీ పాఠశాలలో జరిగిన లీకేజీ కేసులో సంజయ్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఆయన ప్రోద్బలంతోనే మిగిలిన నిందితులు ప్రశ్నపత్రాన్ని పరీక్షకేంద్రం నుంచి దొంగతనంగా సేకరించి వాట్సప్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని ఆరోపించారు. ఆయనపై 120 (బి), 420, 447, 505 (1)(బి) ఐపీసీ, 4(ఎ), 6, రెడ్‌విత్ 8 ఆఫ్ టీఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ మాల్‌ప్రాక్టీసెస్) యాక్ట్-1997, సెక్షన్ 66-డి ఐటీ యాక్ట్-2008 కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Also Read : Raviteja: కంచం ముందుకు, మంచం మీదకు ఆడపిల్లలు పిలవంగానే రావాలి.. లేకపోతే