టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై ప్రభుత్వం వైఫల్యంపై యువత ఆక్రోశంతో ఉన్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి అక్రమాల నుండి దృష్టి మరల్చేందుకు కేసీఆర్ ఇలాంటి సంఘటనలు క్రియేట్ చేస్తారని ఆరోపించారు. పోలీస్ లను పావులుగా వాడుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈటల కు ఈ రోజు 5.30 కి నోటీసులు జారీ చేసి .. 6 గంటలకు హాజరు కావాలని ఆదేశించారని, మీకు మెసేజ్ పంపించారు.. మిమ్మల్ని దర్యాప్తు చేయాలని నోటీసులు పంపించారు.. వాట్సప్ మెసేజ్ లు వచ్చిన వారిని పిలిస్తే ఒకరు కూడా మిగలరని ఆయన అన్నారు.
Also Read : Jagananna Mana Bhavishyath: ఎలక్షన్ మూడ్‌లోకి వైసీపీ.. అందుకే క్యాంపెయిన్
ఈటల మీ లాగా దిగజారి వ్యక్తి కాదని, ఇది చాలా దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు. మేము ఏమైనా మీ జీతగాళ్ళం అనుకుంటున్నావా.. ఎన్నికైన ప్రతినిధులు కల్వకుంట్ల కుటుంబానికి బానిసలు అనుకుంటున్నారా.. కీలు బొమ్మలము అనుకుంటున్నారా.. తెలంగాణ సమాజం అన్ని గమనిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. ఇంత బరి తెగింపా… ప్రశాంత్ అనే వ్యక్తి పంపించిన వారిలో ఎక్కువ మంది జర్నలిస్టు లు ఉన్నారు. వారిని కూడా బెదిరిస్తున్నారు. ఫోన్ కు మెసేజ్ పంపించారు.. మీ ఫోన్ కావాలని పోలీసులు అడగడం ఏంటి.. కల్వకుంట్ల కుటుంబానికి అనుకూల మైన వార్తలు ఎన్నైనా పెట్టుకోవచ్చు.. ప్రధాని ను దిగజారుడు భాష వాడుతున్నారు.. ప్రధాని మోడీ ఎప్పుడైనా అలా మాట్లాడారా.. కల్వకుంట్ల కుటుంబానికి అధికారం ఎవరు ఇచ్చారు.. అన్‌పార్లమెంటరీగా మాట్లాడే వ్యక్తి ఎవరు అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారే… జర్నలిస్ట్ లకు అండగా ఉంటాము… అన్ని రకాల సహాయ సహకారం అందిస్తాము. బేషరతు గా బండి సంజయ్ మీద పెట్టిన కేసులు ఉప సంహరించుకోవాలి’ అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Also Read : Bandi Sanjay : బండి సంజయ్‌కు బెయిల్